ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా నడుస్తోంది. అప్పటి బాహుబలి, కేజీఎఫ్, సాహో మొదలు మొన్నటి పుష్ప, రాదేశ్యామ్, RRR సినిమాలు హిందీలో సాధించిన కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నెక్ట్స్ కేజీఎఫ్-2 దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉంది. ఒక్క హిట్టు కోసం బీ టౌన్ ఎదురుచూస్తున్న వేళ సౌత్ సినిమాలు హిందీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బీ టౌన్ మొత్తం సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అందుకు అగ్ర నిర్మాతలు, హీరోలు కూడా అతీతులేం కాదు.
ఇదీ చదవండి: నాలుగో రోజు అదే జోరు.. తొక్కుకుంటూ పోతున్న RRR!
తాజాగా అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించాడు. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు నేర్చుకోవాలి. ఎప్పుడు ఒక తరహా చిత్రాలను తెరకెక్కించడం కాదు. బాలీవుడ్ లో మూసధోరణి కొనసాగుతుంది. ఇక్కడ ఒక బయోపిక్ హిట్ అయితే అంతా బయోపిక్లే తీస్తారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా హిట్ అయితే అందరూ సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తారు’.‘నాతో సహా మేమంతా పక్కవారి ప్రాజెక్టులను చూసి సినిమాలు తీస్తూ ఉంటాం. కానీ, సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి కనిపించదు. వారంతా ఎవరి సినిమాలు వాళ్లు తీసుకుంటారు. అందుకు పుష్ప, RRR ముఖ్యమైన ఉదాహరణలు. అందుకే బాలీవుడ్ లోనూ సౌత్ సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి’ అంటూ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించాడు. కరణ్ జోహార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.