కరణ్ జోహార్.. బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయినా కానీ ఆయన పేరు సౌత్‌లోనూ అందరికీ తెలుసు. సినిమాలతో పాటు మీడియాలోనూ పలుమార్లు సెంట్రాఫ్ యాక్షన్‌గా నిలిచాడాయన.
కరణ్ జోహార్.. బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయినా కానీ ఆయన పేరు సౌత్‌లోనూ అందరికీ తెలుసు. సినిమాలతో పాటు మీడియాలోనూ పలుమార్లు సెంట్రాఫ్ యాక్షన్‌గా నిలిచాడాయన. హోస్ట్‌గా సెలబ్రిటీలను రచ్చ లేపే క్వశ్చన్స్ అడిగి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. స్టార్ కిడ్స్‌ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యాలంటే కరణ్ వల్లనే అవుతుంది. సినిమాలు చేసినా, చేయకపోయినా.. తెర వెనుక ఉండి కథ నడిపించడంలో కింగ్ కరణ్. బాలీవుడ్లో బడా చిత్రాలను నిర్మిస్తూ తనదైన శైలిలో సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత గతేడాది.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున తదితరులతో ‘బ్రహ్మాస్త్ర’ (పార్ట్ 1:శివ) సినిమా ప్రొడ్యూస్ చేయగా మంచి హిట్ అయింది. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
బాలీవుడ్లో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే కరణ్ జోహార్‌కు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు. రీసెంట్గా ట్విట్టర్‌కి పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ను చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు. పాపులర్ ఫిలిం పర్సనాలిటీ కరణ్ జోహార్ కూడా థ్రెడ్స్ యాప్‌లోకి ఎంటర్ అయ్యాడు. దీంతో భారీగా ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఈ సందర్భంగా.. నెటిజన్స్, ఫ్యాన్స్.. తనను ఏమైనా అడగొచ్చని, కేవలం పది నిమిషాలు అందుబాటులో ఉంటానని చెప్పాడు.
కట్ చేస్తే ఓ నెటిజన్ ఒక అభ్యంతరకరమైన, ఆశ్చర్యకరమైన ప్రశ్న వేశాడు. ‘‘మీరు ‘గే’ కదా?’’ అని మెసేజ్ చేశాడు. దీంతో కరణ్ రియాక్షన్ ఏంటి?, ఎలాంటి ఆన్సర్ ఇస్తాడోనని అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. కరణ్ ఆ నెటిజన్ తన స్టైల్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘‘నీకు ఆసక్తిగా ఉందా?’’ అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో అతగాడు సైలెంట్ అయిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు ‘కరణ్ రాక్స్, నెటిజన్ షాక్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘కరణ్ బ్రో థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇలా షాకిచ్చాడేంట్రా బాబు’ అంటా చర్చించుకుంటున్నారు.