Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ సినిమా ‘విక్రమ్’. యువదర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడంతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సెట్ చేసింది. అయితే.. విడుదలైన రెండు వారాలకే విక్రమ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా గ్రాస్, రూ. 180 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది.
ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. అయితే.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా అంటేనే.. ఫ్యాన్స్ ఊగిపోయారు. అలాంటిది కమల్ కి పోటీగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఉన్నారని తెలియగానే సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. తీరా సినిమాలో హీరో సూర్య ఎంట్రీ అదరగొట్టేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.. ఇలా విక్రమ్ లో ప్రతి పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు లోకేష్. ఇక విడుదలయ్యాక విక్రమ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో విక్రమ్, రోలెక్స్ పాత్రల తర్వాత ఆ స్థాయి క్రేజ్ అందుకున్న పాత్ర సంతానం. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పోషించిన ఈ సంతానం క్యారెక్టర్ సినిమాలోని హైలైట్స్ లో ఒకటి. విలన్ సంతానం పాత్రలో విజయ్ సేతుపతి అన్నివిధాలా న్యాయం చేశాడు. అందరినీ మెప్పించి ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాడు. ఇప్పటికి సంతానం గురించి జనాలు మాట్లాడుతున్నారంటే.. ఆ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం విక్రమ్ సినిమాలోని సంతానం క్యారెక్టర్ గురించి సినీవర్గాలలో కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో సంతానం క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతి కంటే ముందు వేరే ఇద్దరిని అనుకున్నారట మేకర్స్. వారెవరో కాదు.. స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, రాఘవ లారెన్స్. కానీ.. చివరికి విజయ్ సేతుపతినే క్యారెక్టర్ వరించింది. సంతానం క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి అల్లాడించాడు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు.
ఒకవేళ నిజమైనా విజయ్ సేతుపతి స్థాయిలో ప్రభుదేవా, లారెన్స్ క్యారెక్టర్ కి న్యాయం చేసేవారు కాదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించాడు. త్వరలోనే విక్రమ్ సీక్వెల్ కి సంబంధించి అప్ డేట్ రానుందని టాక్. మరి విక్రమ్ సినిమాలో సంతానం క్యారెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
He Scares Me More… 🥶🔥@VijaySethuOffl as Santhanam 🥵 pic.twitter.com/RDsXeejR2j
— Akshay Krishnan (@_akshay369) June 6, 2022
#RolexSir from #Vikram pic.twitter.com/C6JC9g6sFZ
— VijaySethupathi (@VijaySethuOffl) June 19, 2022