సమాజం నుంచి చాలా తీసుకున్నాం. తిరిగిచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అని చెప్పి చాలా మంది ప్రముఖులు సేవా కార్యక్రమాల దూరంలో ఏదో రకంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆర్థిక ఊబకాయంతో బాధపడి చచ్చేకంటే పది మంది ఆర్ధిక సమస్యలను తీర్చి.. చచ్చాక కూడా చరిత్రలో జీవించే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి అరుదైన అదృష్టం, గౌరవం కోసం కొంతమంది ఆపదలో ఉన్న వారిని ఆడుకుంటారు. వారికి సొంత డబ్బుతో వైద్యం చేయిస్తుంటారు. పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. వారిని చదివించి గొప్పవారిగా తీర్చిదిద్దుతుంటారు. అలాంటి గొప్పవారిలో రాఘవ లారెన్స్ ఒకరు.
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై... ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది. విజేతగా నిలిచింది.
సినీ ఇండస్ట్రీలో హర్రర్ నేపథ్యంలో వచ్చి.. ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన మూవీ ‘చంద్రముఖి’. 2005 లో పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార, జ్యోతిక కీలకపాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే ఈ చిత్రం అప్పట్లో థియేటర్లో ప్రేక్షకులను భలే అలరించింది. చంద్రముఖి సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ వస్తుందని అందరూ భావించారు.. కానీ అలా జరగలేదు. చాలా కాలం తర్వాత ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. […]
రాఘవ లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్.. ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఎక్కువగా హారర్ కామెడీ జానర్ లో ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు చేసి అటు హీరోగా, ఇటు దర్శకుడిగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. లారెన్స్ హీరోగా ఇప్పుడు చాలా సినిమాలు లైనప్ చేశాడు. కాంచన 3 తర్వాత మళ్లీ లారెన్స్ నుండి కొత్త సినిమా రాలేదు. […]
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార కాంబినేషన్లో వచ్చి.. మంచి సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘చంద్రముఖి’. ఈ సినిమాను తమిళన దర్శకుడు వాసు తెరకెక్కించగా జ్యోతిక, ప్రభు, వడివేలు మొదలైన వాళ్లు కీలకపాత్రల్లో నటించారు. ఈసినిమా బాక్సాపీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ప్రేక్షకులను ఎంతో అలరించిన ఈ సినిమాకు స్వీకెల్ గా చంద్రముఖి-2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో చందమామ కాజల్ అలరించనుంది. […]
Raghava Lawrence: సౌత్‌లో టాలెంటెడ్ సినిమా పర్సన్ అని ఎవరి గురించైనా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే.. రాఘవ లారెన్స్ ముందు వరుసలో ఉంటారు. సైడ్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన నేడు హీరోగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. సినిమాలే కాదు.. సేవారంగంలోనూ ఆయన ముందుంటున్నారు. అవసరమైన వారికి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నారు. ఇది రజనీకాంత్ […]
ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. దీంతో ఆయన అభిమానులలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. కృష్ణంరాజు మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలలోని సన్నిహిత రాజకీయనేతలు, భారీ సంఖ్యలో అభిమానులు.. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. రెబల్ స్టార్ గా వెలుగొందిన కృష్ణంరాజు ఇకలేరనే […]
రజినీకాంత్.. కండక్టర్ స్థాయి నుంచి చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. దక్షిణాదిలోనే కాకుండా ఆయన క్రేజ్ ఇండియా మొత్తం పాకిపోయింది. ఇక ఆయన చిత్రం వస్తుందంటే చాలు అభిమానులు థియేటర్ ముందు రచ్చ రచ్చ చేయాల్సిందే. అలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ హీరోకి హీరోలే అభిమానులుగా మారిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం ఏంటంటే? రజినీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి […]
సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిన్న కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టిన లారెన్స్ ఇప్పుడు స్టార్ హీరోగానే కాదు.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. లారెన్స్ తెరకెక్కించిన కాంచన సీరీస్ ప్రేక్షకులను భయపెట్టడమే కాదు.. కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీస్ తో లారెన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. లారెన్స్ కేవలం నటుడిగానే కాకుండా.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు […]
Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ సినిమా ‘విక్రమ్’. యువదర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడంతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సెట్ చేసింది. అయితే.. విడుదలైన రెండు వారాలకే విక్రమ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు […]