రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మూవీ ఊహించుకుంటుంటూనే పిచ్చెక్కిపోతుంది కదూ. మరి ఈ ఇద్దరి కాంబోలో ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా?
మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ దాకా రామ్ చరణ్ ఎదిగిన తీరు చాలా అసామాన్యమైనది. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ మిస్సైల్ కంటే వేగంగా రామ్ చరణ్ ముందుకు దూసుకుపోతున్నాడు. లేటెస్టుగా కూతురు పుట్టడంతో తండ్రి హోదాలో చాలా సంతోషాన్ని అనుభవిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం తాను చేసే సినిమా కంప్లీట్ అయిన తర్వాత తన నెక్స్ట్ సినిమా ఉప్పెన మూవీ డైరెక్టర్ సానా బుచ్చిబాబుతో చేయబోతున్నాడు. ఆ మూవీలో రామ్ చరణ్ తో పాటు ఇంకో ఇండియన్ గ్రేట్ యాక్టర్ నటించబోతున్నాడు. రామ్ చరణ్ ఆ యాక్టర్ కాంబినేషన్ ఇండియా లోనే మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.
ఒంటి చేత్తో తమ సినిమాని సూపర్ డూపర్ హిట్ చెయ్యగల అతికొద్ది మంది హీరోల్లో రామ్ చరణ్ ఒకడు. యాక్టింగ్, ఫైట్స్, డాన్సుల్లో రామ్ చరణ్ తన ట్రేడ్ మార్కుని చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. చరణ్ ప్రస్తుతం తమిళ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీని చేస్తున్నాడు. చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతుంది. చరణ్ తన నెక్స్ట్ సినిమా ఉప్పెన సినిమా దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వం లో చేస్తున్నాడు. ఈ మూవీలో తమిళ సినిమా సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటించబోతున్నాడనే వార్త టాక్ అఫ్ ది సౌత్ సినిమా అయ్యింది.
విజయ్ సేతుపతి..ఇప్పుడు ఇండియా లో నే నెంబర్ వన్ ఆర్టిస్ట్. తమిళంలో విజయ్ సేతుపతి సినిమా వస్తుందంటే చాలు అభిమానులకి పండగ రోజు. అలాగే విజయ్ సేతుపతి కి తెలుగు లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే వార్త విని రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. పైగా విజయ్ సేతుపతి ఆ మూవీలో విలన్ గా చేస్తున్నాడని తెలియడం తో అటు రామ్ చరణ్ అభిమానులు ఇటు విజయ్ సేతు పతి అభిమానులిద్దరు కూడా ఆ మూవీ కి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ కోసం చుస్తునారు. సానా బుచ్చిబాబు ఈ మధ్యనే విజయ్ సేతుపతిని కలిసి రామ్ చరణ్ సినిమా లో విజయ్ సేతుపతి కి సంబందించిన క్యారక్టర్ ని చెప్పాడు. తన క్యారక్టర్ నచ్చి విజయ్ సేతుపతి విలన్ గా రామ్ చరణ్ సినిమా లో చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
ఆల్రెడీ సాన బుచ్చిబాబు ఫస్ట్ మూవీ ఉప్పెన లో ఒక పవర్ ఫుల్ రోల్ లో విజయ్ సేతుపతి సూపర్ గా నటించి ఆ మూవీ ఘన విజయంలో ఎంతో పాత్ర పోషించాడు. తన ప్రతి సినిమాలో రామ్ చరణ్ తన శత్రువైన విలన్ ని తన పవర్ ఫుల్ మాటలతో భయపడేలా చేయడమే కాకుండా తన సూపర్ ఫైట్స్ తో విలన్ ఆట కట్టిస్తాడు. అలాగే విజయ్ సేతుపతి కూడా తన పవర్ ఫుల్ విలనిజం తో హీరో ఆలోచనలో నా శత్రువు కూడా నాలాగా బలమైన వాడు అని హీరో అనుకునేలా చేయడంలో తన క్యారెక్టర్ ద్వారా విజయ్ సేతుపతి సూపర్ పెరఫార్మెన్స్ ని ప్రదర్శిస్తాడు. సో రామ్ చరణ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా చేసే సినిమాని చూడడానికి ఇరువురి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకపోతే వెండి తెర మీద ఆ ఇద్దరి కాంబినేషన్ చూడాలంటే కొంతకాలం వెయిట్ చెయ్యక తప్పదు..