సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడిగా మూవీస్, వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
పాన్ ఇండియా నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన విజయ్ సేతుపతి ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడిగా బిజీగా ఉన్నాడు. ఓ హీరోగా నటిస్తూనే విలన్ గా మెప్పిస్తున్నాడు. స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా, నటుడిగా మల్టీ టాలెంట్ తో మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇండస్ట్రీలో మంచి నటుడిగా రాణించడం అంటే సామాన్య విషయం కాదు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో వొడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయ్ సేతుపతి సైతం తన కెరీర్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినట్లు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.
విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఏదైనా.. అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు.. ప్రేక్షకులను మెప్పిస్తాడు. హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రలు ఏవైనా సరే అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేస్తాడు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి తర్వాత ‘తెన్మెర్కు పరువాకత్రు’ మూవీతో హీరోగా మారారు. హీరో గా రాణిస్తున్న సమయంలోనే విలన్ పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా సత్తా చాటుతున్నారు. సహాయక పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్ లోనూ కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నా సేతుపతి ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ ఈజీగా అంతగా రాలేదు. విజయ్ ఆఫర్ల కోసం ఫోటోలను చేతులో పట్టుకొని తన చెప్పులను అరిగిపోయేలా తిరిగారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు.
ఇటీవల విజయ్ సేతుపతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ప్రారంభంలో ఎన్నో ఛేదు అనుభవాల గురించి మాట్లాడారు. ‘సినిమాల్లో ఛాన్సులు అంత ఈజీగా రావు.. మొదట్లో ఓ థియేటర్లో అకౌంటెంట్ గా పనిచేస్తూ నా ఫోటోలు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగేవాన్ని. ఆ సందర్భంలో ఇండస్ట్రీలో కొంతమంది నన్ను దారుణంగా అవమానించారు. నీ ముఖానికి సినిమాలు కావాల బాబూ అంటూ వెక్కిరించారు. కొంతమంది అయితే వద్దులే ఫోటోలు ఇప్పుడు అవసరం లేదు అంటూ తిరస్కరించేవారు. ఇంకొంతమంది అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి సెట్స్ వెళ్లగానే ఆ పాత్ర మరొకరిచే చేయించేవారు. ఆ సమయంలో నేను ఎంతోబాధపడేవాడిని. ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని.. కానీ నాలో నటుడు కావాలన్న పట్టుదల చావలేదు. ఎన్ని అవమానాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నా ఆత్మవిశ్వాసమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు.