దర్శకధీరుడు రాజమౌళి.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఖండాంతరాలు దాటించిన ఘనుడు. ప్రపంచ దేశాలకు అక్కడికి ప్రజలకు ఇండియన్ సినిమాని, టాలీవుడ్ గొప్పతనాన్ని తెలియజెప్పిన వ్యక్తి. హాలీవుడ్ ముందు ఇండియన్ సినిమా ఏమాత్రం తక్కువ కాదని ఇప్పటికే నిరూపించారు. తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందింది అంటే దాని వెనుక ఉన్న ఆయన కృషిని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించేందుకు ఈ దర్శక ధీరుడు సిద్ధమవుతున్నాడు.
అందరూ సినిమాలు తీస్తుంటే.. రాజమౌళి మాత్రం అద్భుతాలను తీస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించే స్థాయి నుంచి ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ తో ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగారు.. తెలుగు సినిమా ఎదిగేలా చేశారు. ఇప్పుడు 95వ అకాడమీ అవార్డుల్లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. అయితే దాని వెనుక దాగున్న రాజమౌళి కష్టం, కృషి, వ్యూహం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు జరిగింది ఏంటో తెలుసుకుంటే జక్కన్నకు సెల్యూట్ అనకుండా మానరు.
ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డుకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అవార్డు అందుకోవాలి అంటే టాలెంట్ ఉండాలి, ప్రెజంటేషన్ ఉండాలి అని అనుకుంటారు. అయితే కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదని చాలా మందికి తెలియదు. నిజానికి ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలి అంటే వాళ్ల దేశం నుంచి సపోర్ట్ కూడా ఉండాలి. కానీ, ఓపెన్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యిందంటే అది మామూలు విషయం కాదు.
WE CREATED HISTORY!! 🇮🇳
Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe
— RRR Movie (@RRRMovie) January 24, 2023
ఒక సినిమా ఆస్కార్ బరిలోకి వెళ్లాలి అంటే ముందు ప్రపంచ దేశాలకు మన సినిమా గురించి తెలియాలి. మన సినిమా గురించి ప్రపంచం మొత్తం కోడై కూయాలి. ఫలానా ట్రిపులార్ సినిమా ఒకటి ఉంది. అది ఒక కళాఖండం, దానిని తప్పకుండా చూడాలి అని ప్రపంచ ప్రేక్షకులను ఉసిగొలపాలి. ఇంతకాలం రాజమౌళి చేసింది అదే. ట్రిపులార్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. దేశ దేశాలు తిరుగుతూ, హీరోలను తిప్పుతూ ఇది మా సినిమా, వీళ్లు మా స్టార్లు అంటూ ప్రపంచానికి చూపించారు. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం వెనుక కూడా ఈ వ్యూహమే దాగుంది.
This year’s Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh
— The Academy (@TheAcademy) January 24, 2023
సినిమా విడుదలైన నెలలు గడిచిపోయినా కూడా సోషల్ మీడియా వేదికగా ట్రిపులార్ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమా విడుదల నుంచి ఆస్కార్ కు నామినేట్ అయ్యే వరకు ప్రజలు, ప్రేక్షకులు ట్రిపురాల్ గురించి మాట్లాడుకున్నారు అంటే అది రాజమౌళి వల్లనే. ఈ పాటలో కీరవాణి మెస్మరైంజిగ్ సంగీతం, చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ ని తక్కువ చేయడానికి లేదు. కానీ, ఆ పాట ఇంతదూరం రావడం వెనుక మాత్రం రాజమౌళి కృషి ఉంది. వ్యూహాలు, పీఆర్ కార్యక్రమాలు, ప్రమోషన్స్, విదేశాల్లో టూర్లు, ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు- ఆర్టిస్టులను కలవడం ఇదంతా రాజమౌళి కష్టం. ట్రిపులార్ సినిమా, నాటు నాటు పాట ఇంత వరకూ వచ్చాయంటే అది రాజమౌళి వల్లే అని బల్లగుద్ది చెప్పొచ్చు.
ONE STEP AWAY FROM THE PINNACLE OF CINEMATIC GLORY !!! 🎉🔥🎉👏👏
Heartiest Congrats on THE Oscar Nomination for Best Original Song @mmkeeravaani garu & the visionary @ssrajamouli and the Entire Team behind #NaatuNaatu & @RRRMovie
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023