సంగీత దర్శకుడు కీరవాణి ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తారు. ఆయన తనలోని భావోద్వేగాలను బయటకు చూపించరు. కానీ ఒక వీడియో చూశాక మాత్రం.. కీరవాణి కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. అసలు ఏంటా వీడియో, దాని కథాకమామీషు ఏంటనేది తెలుసుకుందాం..
'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడానికి కారణం ఎవరు అంటే మీరు రాజమౌళి లేదా కీరవాణి.. ఇలా తలో పేరు చెబుతారు. కానీ కార్తికేయ అనే వ్యక్తి అసాధ్యం అనుకున్నది కాస్త సాధ్యమైంది అంటే నమ్ముతారా? ఇంతకీ ఆ కార్తికేయ ఎవరో తెలుసా?
దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వాళ్లందరికీ ఒక ఎమోషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఎక్కువ సమయం స్క్రీన్ ని పంచుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ముల్లా ఆ అనుబంధాన్ని తెరపై రక్తికట్టించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కళ్ళ నుంచి నీళ్లు తెప్పించారు. అంతేనా నవ్వించారు, కథతో పాటు నడిపించారు, మనతోనీ నవరసాలు పండించారు. నాటు నాటు పాటకు కలిసి స్టెప్పులు వేస్తూ నరనరాల్లో జీవం పోశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి డ్యాన్స్ వేసేంతగా మనల్ని ఉర్రూతలూగించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మాత్రమే కాదు.. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన వారిది, పాట రాసిన రచయితది, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడిది, దాన్ని అత్యంత అద్భుతంగా ఆలపించిన సింగర్స్ ది. వీరందరి శ్రమ ఫలితమే ఆస్కార్ అవార్డు. ప్రతి తెలుగు వారూ ఎదురుచూస్తున్న అత్యంత అద్భుతమైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది.
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా నుండి ఆస్కార్ బరిలో పోటీపడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుండి 'నాటు నాటు' సాంగ్ ఎంపిక అవ్వడంతో భారతీయులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 12న(మార్చి 13న ఇండియన్ టైంలో) అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు.. రేపు ఆస్కార్ లో ఎలాంటి రచ్చ చేయనుందోననే కుతూహలం కూడా నెలకొంది.
ఇప్పటికీ కొంతమంది అన్నదమ్ములు ఉంటారు. ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం కాకుండా ఆత్మీయత కోసం, అనుబంధాల కోసం పడిచచ్చే అన్నదమ్ములు ఉంటారు. ఒకే బెడ్ పై పడుకునే అన్నదమ్ములు ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఒకే కంచంలో అన్నం తినే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? కానీ సొంత అన్నదమ్ములు కాకపోయినా బాబాయ్, పెదనాన్న పిల్లలు అయిన రాజమౌళి, కీరవాణి మాత్రం సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే కంచంలో తిన్నారు.
దర్శకుడిగా రాజమౌళి పేరు ప్రపంచానికి తెలిసినప్పటికీ.. ఆయన ఫ్యామిలీలో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కార్తికేయ, విజయేంద్రప్రసాద్.. ఇలా వీరందరి పేర్లు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. వీరి ఫ్యామిలీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ పేరు తక్కువగా వింటుంటాం. కానీ.. శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది.
చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్(అకాడమీ) అవార్డులకు ఈ ఏడాది ఏర్పాట్లు రెడీ అయిపోయాయి. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలవారు ఆస్కార్ ని గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఏడాది 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12న ఆస్కార్ వేడుకలు జరుగనున్నాయి. మరి ఇప్పటిదాకా ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలిచారు?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా తన సోదరుడు కీరవాణికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అన్నయ్య విషయంలో గర్వంగా ఉన్నట్లు.. కీరవాణితో దిగిన ఫోటోను తన సోషల్ మీడీయాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జక్కన్న. […]
ఎవరి జీవితంలోనైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఆనందాన్ని కలిగించేవి, బాధలను గుర్తుచేసేవి రెండూ ఉంటాయి. అలా సాగిపోతున్న లైఫ్ లో జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సందర్భాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. రీసెంట్ గా ప్రముఖ మలయాళ సింగర్ శ్రీకుమార్.. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనతో వర్క్ చేసినప్పటి ఓ పాత ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అవార్డు అందుకున్న కీరవాణికి […]