దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఈ భాషలోని మాధుర్యం, సొగసు ఆయన చేత ఈ మాటలు అనిపించాయి. ఇక నేడు అంతర్జాతీయ వేదిక మీద కూడా ఈ మాట నిజమని నిరూపితం అయ్యింది. నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుంది. ఈ సందర్భంగా గేయ రచయిత చంద్రబోస్ తెలుగు భాష గొప్పతనం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వాళ్లందరికీ ఒక ఎమోషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఎక్కువ సమయం స్క్రీన్ ని పంచుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ముల్లా ఆ అనుబంధాన్ని తెరపై రక్తికట్టించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కళ్ళ నుంచి నీళ్లు తెప్పించారు. అంతేనా నవ్వించారు, కథతో పాటు నడిపించారు, మనతోనీ నవరసాలు పండించారు. నాటు నాటు పాటకు కలిసి స్టెప్పులు వేస్తూ నరనరాల్లో జీవం పోశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి డ్యాన్స్ వేసేంతగా మనల్ని ఉర్రూతలూగించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మాత్రమే కాదు.. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన వారిది, పాట రాసిన రచయితది, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడిది, దాన్ని అత్యంత అద్భుతంగా ఆలపించిన సింగర్స్ ది. వీరందరి శ్రమ ఫలితమే ఆస్కార్ అవార్డు. ప్రతి తెలుగు వారూ ఎదురుచూస్తున్న అత్యంత అద్భుతమైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, సోషల్ మీడియా మొత్తం నాటు నాటు అనే ఒకటే మాట వినిపిస్తోంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్స్ కి నామినేట్ కావడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వెల్లిబుచ్చుతున్నారు. ఒక్క అభిమానులే కాదు.. సినీ తారలు, సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, దేశ విదేశాల్లో ఉన్న ట్రిపులార్ అభిమానులు ట్వీట్లు, పొగడ్తలు, పోస్టులతో హోరెత్తిస్తున్నారు. చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నామంటూ కామెంట్ […]
దర్శకధీరుడు రాజమౌళి.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఖండాంతరాలు దాటించిన ఘనుడు. ప్రపంచ దేశాలకు అక్కడికి ప్రజలకు ఇండియన్ సినిమాని, టాలీవుడ్ గొప్పతనాన్ని తెలియజెప్పిన వ్యక్తి. హాలీవుడ్ ముందు ఇండియన్ సినిమా ఏమాత్రం తక్కువ కాదని ఇప్పటికే నిరూపించారు. తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందింది అంటే దాని వెనుక ఉన్న ఆయన కృషిని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించేందుకు ఈ దర్శక […]
తెలుగు సినిమా చరిత్రలో రాజమౌళి సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ వేదికగా ఎన్నో ఘనతలు సాధించిన రాజమౌళి మరో ఘనతను సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు 95వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ లో స్థానం దక్కించుకుని.. చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచింది. ట్రిపులార్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ ఫర్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ […]
నూతన సంవత్సరంలో కూడా ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. కొత్త ఏడాది ప్రారంభంలోనే సినీ ప్రముఖలు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా గీత రచయింత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ.. అంటే చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి చెందారు. సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) గురువారం రాత్రి హైదరాబాద్ మణికొండలో తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో […]
‘ విక్రమ్’ చిత్రంలోని ” కలయా నిజమా..” అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు. నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల […]