ఇటీవల కాలంలో డైరెక్ట్ సినిమా పాటలే కాదు.. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన సాంగ్స్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రైవేట్ సాంగ్స్ ని కూడా సినిమాలలో భాగం చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్స్ లో ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నాయి. అలా ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ సంపాదించుకున్న వారిలో కండక్టర్ ఝాన్సీ ఒకరు. ఓవైపు గాజువాక డిపోలో కండక్టర్ గా జాబ్ చేస్తూనే, డాన్స్ పై ప్యాషన్ తో ఎన్నో షోలలో పెర్ఫర్మ్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. గతేడాది శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై చేసిన ‘పల్సర్ బైక్’ పాటతో ఒక్కసారిగా తనకంటూ స్పెషల్ హైప్ క్రియేట్ చేసుకుంది.
పల్సర్ బైక్ తో పాపులర్ అయిన ఝాన్సీ.. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో తన సత్తా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కూడా సొంతం చేసుకుంది. అయితే.. ఇప్పుడీ పల్సర్ బైక్ సాంగ్ ని ధమాకా సినిమాలో యాడ్ చేసి సందడి చేశారు హీరోహీరోయిన్స్ రవితేజ, శ్రీలీల. రాజా ది గ్రేట్ లో ‘గున్నమామిడి’ సాంగ్ తర్వాత ధమాకాలో ఈ పల్సర్ బైక్ సాంగ్ పెట్టి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. పైగా క్లైమాక్స్ లో ఈ సాంగ్ ఫ్యాన్స్ అందరినీ తెగ అలరించిందని అంటున్నారు. ఈ క్రమంలో పల్సర్ బైక్ సాంగ్ కి గాజువాక కండక్టర్ ఝాన్సీ ఎనర్జీతో, శ్రీలీల ఎనర్జీని కంపేర్ చేస్తున్నారు నెటిజన్స్.
ఝాన్సీ కారణంగా పల్సర్ బైక్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో జనాల్లోకి వెళ్ళింది. అదే ఊపులో సాంగ్ ని ఏ సినిమాలో పెట్టుకున్నా అంతే ఎనర్జీని ప్రదర్శించాల్సి వస్తుంది. కానీ.. శ్రీలీల శారీలో కూడా మాస్ డాన్స్ తో అదరగొట్టేసింది. తాజాగా ధమాకా మూవీ నుండి పల్సర్ బైక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ క్రమంలో సాంగ్ చూసిన ఆడియెన్స్ అంతా శ్రీలీల పెర్ఫార్మన్స్ కి ఫిదా అవుతున్నారు. అయితే.. ఝాన్సీ ఎనర్జీని శ్రీలీల ఎనర్జీతో పోల్చడం కంటే.. ఇద్దరి పెర్ఫార్మన్సులు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. సో.. పైగా ఇప్పుడు శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. కాబట్టి.. కంపారిజన్ కంటే చూసి ఎంజాయ్ చేయడమే బెటర్ అంటున్నారు. మరి పల్సర్ బైక్ సాంగ్ లో కండక్టర్ ఝాన్సీ, శ్రీలీల డాన్స్ లలో ఎవరి డాన్స్ మీకు ఎక్కువగా నచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి.