జబర్దస్త్ నరేష్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చిన నరేష్ అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. కటౌట్ తక్కువగా ఉన్న తన కంటెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే స్కిట్ లో భాగంగా అప్పుడప్పుడు నరేష్ డ్యాన్స్ కూడా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇదిలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కృష్ణభగవాన్ ఎంట్రీ ఇస్తూ తన పంచులతో కడుపుబ్బ నవ్వించాడు. ఇక హైపర్ ఆదీ, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వంటి కమెడియన్లు సైతం కమెడీ పంచులతో ఆకట్టుకుంటున్నారు.
వీటన్నిటిని పక్కన బెడితే మరీ ముఖ్యంగా ఈ ప్రోమోలో జబర్దస్త్ నరేష్ డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. మగధీర సినిమాలోని బంగారు కోడి పెట్ట అనే సాంగ్ కు నరేష్ తన డ్యాన్స్ తో దుమ్మలేపాడు. అదిరిపోయే నరేష్ మాస్ డ్యాన్స్ ను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక నరేష్ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ యాంకర్ రష్మి కంటెంట్ ఉన్న వాడికి కటౌట్ అవసరం లేదురా అంటూ పోగిడింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం కాస్త వైరల్ గా మారుతోంది. జబర్దస్త్ నరేష్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.