బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న పాపులర్ టీవీ షోలలో ‘క్యాష్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. అయితే.. క్యాష్ ప్రోగ్రాంకి సంబంధించి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అని ప్రేక్షకులలో ఆసక్తి రేపేందుకు వారవారం ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారు కదా.. అలాగే ఈ వారం కూడా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్ లో జబర్దస్త్ ఆర్టిస్టులు బుల్లెట్ భాస్కర్ – నరేష్.. దొరబాబు – వెంకీ, బాబు – సన్నీ, నవీన్ – తేజ ఇలా ఇద్దరిద్దరూ టీమ్స్ గా పాల్గొన్నారు.
ఇక ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో అంతా చాలా సందడిగా సాగింది. యాంకర్ సుమ కంటెస్టెంట్స్ పై నాన్ స్టాప్ పంచుల వర్షం కురిపించగా.. సుమ ధాటిని తట్టుకొని జబర్దస్త్ నరేష్ సుమపై కౌంటర్స్ వేసి నవ్వించాడు. అయితే.. వీళ్లందరితో కలిసి సుమ గబ్బర్ సింగ్ మూవీలోని అంత్యాక్షరి సీన్ రిపీట్ చేసింది. ఈ క్రమంలో ‘అరే ఓ గబ్బర్ సింగ్ కి ఫౌజియో’ అని అంది సుమ. వెంటనే.. ‘చెప్పండి ఆంటీ’ అనేశాడు నరేష్. ‘ఎన్నిసార్లు చెప్పారా నీకు ఆంటీ అని పిలవొద్దని’ అని కోప్పడింది సుమ. దాంతో నాలుక కరుచుకున్నాడు నరేష్. ప్రస్తుతం వీరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సుమను నరేష్ ఆంటీ అని పిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.