‘జబర్దస్త్’పై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా ఆ షోని ఇప్పటికీ చూసేవాళ్లు చాలామంది. కేవలం షో వరకే కాకుండా కొన్ని స్కిట్స్ కోసం, పలువురు కమెడియన్స్ కోసం చూసేవాళ్లు మరికొందరు. గురు, శుక్రవారాల్లో వచ్చే ఈ షోలో అప్పటితో పోలిస్తే ఇప్పుడు కామెడీ తగ్గిందని వాదన వస్తోంది. కానీ షో ప్రభావం మాత్రం తగ్గడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చాలామంది తెలుగువారికి ఇష్టమైన షోగా మారింది. దీనితో పాటే ఇతర షోలు కూడా ఆడియెన్స్ ని అలరిస్తుంటాయి. అలాంటి వాటిలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పండగ స్పెషల్ ఈవెంట్స్.. ఇలా అన్నింట్లోనూ కనిపించే వ్యక్తి నాటీ నరేశ్. మనోడు చూడటానికి చిన్నగా ఉంటాడు. కానీ కామెడీ మాత్రం ఫుల్ గా చేస్తాడు. నరేశ్ స్కిట్ లో ఉన్నాడంటే.. చూస్తున్న ప్రేక్షకులే కాదు సెట్ లో ఉన్న మిగతా కమెడియన్స్ కూడా నవ్వుతూనే ఉంటారు. చలాకీ చంటీ టీమ్ తో ప్రస్థానం మొదలెట్టిన నరేశ్.. బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేసి తెగ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇన్నేళ్ల నుంచి షోల్లో చేస్తున్నప్పటికీ నరేశ్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికర విషయాన్నే బయటపెట్టాడు.
వరంగల్ జిల్లా జనగామ మండలం అనంతపురం గ్రామానికి చెందిన నరేశ్ వయసు ఇరవై ఏళ్లు పైనే. కానీ చూడటానికి పిల్లాడిలా కనిపిస్తాడు. అందుకే షోకి వచ్చిన హీరోయిన్స్ గానీ, గెస్టులు గానీ మనోడిని ముద్దు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ లో నరేశ్ కి ఓ అమ్మాయి పరిచయం కావడం, ఆ తర్వాత రిలేషన్ లో ఉండటం జరిగిందట. అయితే ఆ అమ్మాయి తనని నిజంగా ప్రేమించడం లేదని, డబ్బులు కోసం వాడుకుని మోసం చేద్దామనుకుందట. ఈ మొత్తం విషయాన్ని ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ సాంగ్ కంపోజ్ చేసి మరీ చూపించారు. ఈ బ్రేకప్ సాంగ్ గురించి గెస్ట్ సదా అడగ్గా.. నరేశ్ నిజమని చెప్పాడు. మరి ఇదంతా కూడా టీఆర్పీ కోసం చేసిన స్టంటా లేదా నిజంగానే నరేశ్ లైఫ్ లో అలా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. మరి నరేశ్ ఫెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: గెటౌట్ అంటూ దేవి నాగవల్లిపై నరేష్ స్కిట్.. అనిల్ రావిపూడి రియాక్షన్ వైరల్!