లేట్‌గా ప్రారంభమైనా సరే.. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు గట్టి పోటీ ఇస్తూ.. దూసుకుపోతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆదివారం మధ్యాహ్నం పూట ప్రసారమ్యే ఈ షో కు చాలా మంది అభిమానులున్నారు. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. మెసేజ్ ఒరియెంటెడ్ స్కిట్స్ కూడా చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తు ఉంటుంది. రష్మీ ఈ షోకు యాంకర్‌గా ఉండగా.. ఇంద్రజ జడ్జీగా ఉంది. ప్రతి వారం ఎవరో ఒకరు ప్రత్యేక అతిథులను ఆహ్వానిస్తూ.. వారితో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. తాజాగా డిసెంబర్ 11న ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఎప్పటిలానే ఈ వారం కూడా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్‌లుగా ముఖచిత్రం సినిమా టీమ్ స్పెషల్ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ చిత్రంలో హుషారు ఫేమ్ ప్రియ వడ్లమాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ క్రమంలో ముఖచిత్రం డైరెక్టర్ సందీప్ రాజ్‌తో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది ప్రియా వడ్లమాని. ఈ క్రమంలో హైపర్ ఆది ఆమెను టీజ్ చేయాలని ప్రయత్నించడం.. చివరకు ఆమె అన్నయ్య అని పిలిచి ఆదికి షాకివ్వడం చేసింది. ఇక షోలో భాగంగా.. ఇంద్రజ తన డ్యాన్స్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంద్రజ డ్యాన్స్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె హీరోయిన్‌గా చేసిన సమయంలో.. తన అందం, నటనతో పాటు డ్యాన్స్‌కు కూడా అభిమానులున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మరోసారి తన డ్యాన్స్‌తో అందరిని ఆశ్చర్యపరిచారు ఇంద్రజ. తొలుత ప్రియమైన నీకు సినిమాలోని మనసున ఉన్నది పాటకు డ్యాన్స్ చేయగా.. ఆ తర్వాత గజినీ సినిమాలోని.. రహతుల్ల రహతుల్ల రహుతల్ల వల్ల పాటకు మాస్ స్టెప్స్ వేసి తనలో ఎనర్జీ, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు ఇంద్రజ. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.