ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం. ఆ కాలం నుంచి నేటి జనరేషన్ వరకు ఇవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు ప్రేమించుకోవడం.. నచ్చితే కంటిన్యూ కావడం.. లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయ్యింది. ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ ఉన్న వారిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారనే విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని ప్రముఖ నటి షావుకారు జానకి వెల్లడించడంతో ఇది వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షావుకారి జానకి .. సీనియర్ ఎన్టీఆర్-కృష్ణ కుమారిల ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
సీనియర్ ఎన్టీఆర్-కృష్ణ కుమారిల మధ్య ప్రేమ వ్యవహారం కన్నా ముందే ఆయనకు బసవతారకంతో వివాహం అయ్యింది. వారికి అప్పటికే 12 మంది సంతానం. కృష్ణ కుమారి-ఎన్టీఆర్ పలు సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది.. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణ కుమారి సోదరి షావుకారి జానకి దీనిపై స్పందించారు.
కృష్ణ కుమారి-ఎన్టీఆర్‌ల ప్రేమ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కృష్ణ కుమారి సోదరి, నటి షావుకారు జానకి. ‘‘ఎన్టీఆర్- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు వివాహం జరగడమేకాక 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు.. వాళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది.
తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు కూడా ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను’’ అంటూ అప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకుంది కృష్ణకుమారి. మరిదీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.