టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసి తెరమరుగౌతుంటారు. ఒక్క హిట్ పడితే చాలు.. వరుసగా ఆఫర్లు వచ్చి కాల్ షీట్స్ ఫుల్ అయిపోతాయి.
టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసి తెరమరుగౌతుంటారు. ఒక్క హిట్ పడితే చాలు.. వరుసగా ఆఫర్లు వచ్చి కాల్ షీట్స్ ఖాళీ ఉండదు. కానీ సినిమా ఎంపికలో లోపమో, మరో ఇతర సమస్యల కారణంగా ఫేడ్ అవుట్ అవుతారు. అందుకే పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కొంచెం లక్ ఉండాలి. అటువంటి వారిలో ఒకరు జూఎన్టీఆర్ హీరోయిన్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బొద్దు గుమ్మ కీర్తి చావ్లా. ఆ నటి ఇప్పుడు ఎంతలా మారిపోయారంటే..?
ఆది సినిమాలో నందినీ రెడ్డి క్యారెక్టర్‌లో కనిపించింది కీర్తి చావ్లా. ఆ సమయంలో జూ ఎన్టీఆర్ ఫిగర్‌కు ఫరెఫ్ట్‌గా సెట్టైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆమెను ఏడిపించే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాతో పాటలన్నీ బిగ్గెస్ట్ హిట్. ఆమె బొద్దుగా కనిపించినా.. చాలా బాగా ఆదరించారు. అయితే అదే ఆమెకు అవకాశాలు దూరం చేసిందనుకుంట. ఆ తర్వాత మన్మధుడులో ఒక సాంగ్‌లో మెరిసింది. జేడీ చక్రవర్తితో కాశి అనే సినిమాలో కనిపించారు. శ్రావణమాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, బ్రోకర్ వంటి చిత్రాల్లో నటించినా.. ఆమెకు పేరు రాలేదు. అయితే ఈ సమయంలో తమిళ,కన్నడ సినిమాల్లో నటించింది అమ్మడు.
చాన్నాళ్లు గ్యాప్ తీసుకున్న కీర్తి.. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఓ అమ్మాయి ప్రేమ కథలో కనిపించింది. కరోనా టైమ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. గ్లామర్‌పరంగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయం తెలియరాలేదు. అయితే సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు కొన్ని కనిపిస్తున్నాయి. అందులో ఆమెలో ఏ మాత్రం అందం కూడా తగ్గినట్లు కనిపించడం లేదు. అయితే బొద్దుగా మారి తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఇక ఆఫర్స్ తగ్గిపోయిన తర్వాత కీర్తి చావ్లా అప్పుల పాలైనట్టు సమాచారం. స్నేహితులతో కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.