‘సోనూసూద్’ రీల్ లైఫ్ విలన్ కాస్తా… కరోనా సమయంలో ‘రియల్ లైఫ్ హీరో’గా మారిపోయాడు. అడిగిన వారికి లేదనకుండా తనవంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు సోనూసూద్. పేరుకు తగ్గట్టే మనిషి కూడా బంగారం అని నిరూపించుకున్నాడు. తాజాగా సోనూపేరు సహాయకార్యక్రమాలు కాకుండా రాజకీయాల్లో వినిపిస్తోంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2022లో జరగనుండగా.. వీటి విషయంలో… కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ అభ్యర్థిని చాలా ముందుగానే ప్రకటించే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి రేసులో మాహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్,… మోడల్, ఫిట్‌నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఉన్నట్లు ప్రచారం జరిగింది.
ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. గతంలో సోనూసూద్‌పై రాజకీయనాయకులు కొందరు చవాకులు విసిరారు. రాజకీయాల కోసమే ఈ సహాయాలు అంటూ విమర్శించారు. అభిమానుల్లో ఒకింత అనుమానం, భయం నెలకొంది. నిజంగానే సోనూసూద్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? అని. ఆ వార్తలపై ట్విట్టర్ వేదికగా సోనూసూద్ క్లారిటీ ఇచ్చేశాడు. సోనూసూద్ 2022 ముంబయి మేయర్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి అన్న ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. అది నిజం కాదు, సామాన్యుడిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అని పుకార్లకు కళ్లెం వేశాడు సోనూసూద్. ఆ వార్తలకు అభిమానులు సైతం సోనూ రాజకీయాల్లోకి రావ్వొద్దంటూ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.
Not true,
I am happy as a common man 🇮🇳 https://t.co/w5665MqAwc— sonu sood (@SonuSood) August 24, 2021