సోనూసూద్.. ఇప్పుడు ఇండియాలో ఏ ఇద్దరు కలసిన ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి గొప్పగా పొగుడుతున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.., వేల మందికి సోనూ సహాయం అందిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఇంత చేస్తున్నాడు కాబట్టే సోనూసూద్ రియల్ హీరో అయిపోయాడు. కానీ.., ఇప్పుడు సోనూసూద్ ని అభిమానించే వారికి పూనకాలు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ రియల్ హీరో.. ఇప్పుడు రీల్ హీరోగా టర్న్ కాబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోనూసూద్ కి సినీ ఇండస్ట్రీ కొత్త కాదు. బాలీవుడ్ టూ టాలీవుడ్ లో ఆయన చాలా సినిమాల్లోనే నటించాడు. కానీ.., అవన్నీ కూడా విలన్ రోల్స్. లేదా కాస్త కామెడీ వేషాలు. కానీ.., ఇప్పుడు సోనూసూద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోయే ఓ పాన్ ఇండియా మూవీతో. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలోనే కాదు.., సోషల్ మీడియాలో కూడా చర్చకి కారణం అవుతోంది.
2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా మీ అందరికీ గుర్తుంది కదా? ఈ మూవీనే సోనూసూద్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తరువాత సోను కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక అతడు, కందిరీగ లాంటి మూవీస్ లో సోనూసూద్ కి మంచి క్యారెక్టర్స్ దక్కాయి. తరువాత బాలీవుడ్ లోనూ బిజీ అయ్యాడు సోనూ భాయ్. కానీ.., ఎప్పుడూ హీరో కాలేకపోయాడు. కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమంలో ఆయన్ని దేశ వ్యాప్తంగా హీరోగా మార్చేశాయి. దీనితో ఇపుడు సోనూసూద్ ని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి దర్శకనిర్మాతలు ముందుకి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ సోనూసూద్ కోసం ఓ అద్భుతమైన కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోనూసూద్ కి క్రిష్ కథ వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించనున్నారట మేకర్స్. కనీసం రూ.200కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సోనూసూద్ కి నేషనల్ వైడ్ లో ఫ్యాన్స్ ఉండటంతో ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. ఇక సోనూసూద్.. క్రిష్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మణికర్ణిక సినిమా నుంచి క్రిష్ తప్పుకున్న వెంటనే సోనూసూద్ కూడా తప్పుకున్నారు. ఇంత క్లోజ్ కాబట్టే.. క్రిష్ అడగగానే సోను ఈ ప్రయోజెక్టు కి ఓకే చెప్పేశాడట. సో.. త్వరలోనే మన రియల్ లైఫ్ హీరోని.. రీల్ లైఫ్ లో కూడా హీరోగా చూడబోతున్నాము అనమాట. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.