దేశవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో ‘సోనూసూద్’ చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఏ మూల నుంచి ఎవరు సహాయం కోసం అర్థించినా కాదనకుండా ఆదుకున్న రియల్ హీరో. వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, కార్లు ఇలా ఏది అందుబాటులో అది. అందరినీ ఇళ్లకు చేర్చాడు. అందరి గుండెల్లో మంచి మనిషిగా స్థానం పొందాడు. అక్కడితో ఆగకుండా ఫోన్, ఫేస్‌బుక్, ట్వింట్టర్ ఇలా ఎక్కడి నుంచి అభ్యర్థన వచ్చినా వీలైనంత త్వరగా వారికి సహాయం అందేలా ఒక టీమ్‌ను ఏర్పాటు చేశాడు. ఇలా రీల్ విలన్, రియల్ హీరాగా మారిపోయాడు.
గత కొన్ని రోజులుగా సోనూసూద్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబయి మేయర్ అభ్యర్థి సోనూసూద్ వార్తలు రావండం. అదంతా అవాస్తవమని సోనూ క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సోనూసూద్ భేటీ అయ్యాడు. దీని వెనుక రాజకీయ కోణం ఉందని.. పంజాబ్ ఆప్ బలోపేతానికి సోనూసూద్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే ‘దేశ్ కీ మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి సోనూసూద్‌ను ప్రచారకర్తగా నియమించారు. అదే విషయాన్ని మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించారు. కొందరు మాత్రం అదంతా నిజంకాదు. రాజకీయ కోణంలోనే వారి భేటీ సాగిందని వాదిస్తున్నారు.