కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవాళి స్థితి గతులను మార్చేశాయి. ఉహించని ఈ విపత్తు కారణంగా ఈనాటికీ ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఇక మన దేశంలో ఈ మహమ్మారి సృష్టించిన, సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పేదవారు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇంత పెద్ద కష్టంలో.. ప్రభుత్వాలు, అధికారులు కాకుండా.., భారతీయులకి అండగా నిలిచిన తోడు ఎవరైనా ఉన్నారా అంటే సోనూసూద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వలస కార్మికుల కష్టాలు చూడలేక పోయిన ఏడాది సూనుసూద్ సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. అప్పటి నుండి సోనూసూద్ ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. కష్టాల్లో ఉన్నామని ఎవరి నుండి పిలుపు వచ్చినా అక్కడ వాలిపోతున్నారు. గంటల వ్యవధిలోనే వారికి సహాయం అందుతుండటం విశేషం. ఇక ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పోకూడదని ఆయన దేశ వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించడానికి కూడా ముందుకి వచ్చారు. కానీ.., విచిత్రం ఏమిటంటే దేశ ప్రజల కోసం ఇంత చేస్తున్న సూనుసూద్ పై కూడా ఆర్ధిక ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది. సోనూసూద్ ఇన్ని సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? ఆయన ఆస్తి ఎంత? ఆయనకి డబ్బు ఎక్కడ నుండి వస్తోంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సోనుసూద్ ఈ సేవా కార్యక్రమాల కోసం ఎంత ఆస్తిని అమ్మేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా సోనూసూద్ ఆస్తుల గురించి తెలుసుకుందాం. సోనూసూద్ రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుని లాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఆయనకి అలవాటు. ఇలా మొత్తం సోను రూ.135 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది. కానీ.., పోయిన ఏడాది లాక్ డౌన్ మొదలైన నాటికి సోనూసూద్ చేతిలో క్యాష్ లేదు. ఈ కారణంగా ముంబైలోని జూహూ ఏరియాలో తన భార్య పేరిట ఉన్న రెండు షాపులు, ఆరు ఫ్లాట్లను తాకట్టు పెట్టి రూ.10 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. ఆ డబ్బుతోనే సోనూసూద్ అందరికీ సహాయం చేస్తూ వచ్చాడు. ఈ భవనం ముంబైలోని ఇస్కాన్ ఆలయం సమీపంలో ఏ బీ నాయర్ రోడ్డు వెనక ఉంది. ప్రస్తుతం రూ.10కోట్ల అసలు.., దానికి వడ్డీ చెల్లిస్తున్నారట సోనూసూద్. ఇక ఇప్పుడిప్పుడే సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళాలు వస్తున్నాయి. కానీ.., నిన్న మొన్నటి వరకు సోను ఖర్చు చేసింది తన సొంత డబ్బేనట. దీనితో ఆస్తి ఎంత ఉంది అనేది కాదు.., ఎంత మంచి మనసు ఉంది అనేది చూడాలని నెటిజన్స్ సోనూకి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తున్నారు. సొంతవాళ్ళు కూడా సహాయం చేయడానికి వెనకాడుతున్న ఈరోజుల్లో.. సోనూసూద్ తన మానవతా విలువలుని ఈ విధంగా చాటడం నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.