ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్లు అందుకుంది. తరుణ్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన తొలి సినిమాలో అమాయకపు పాత్రలో నటించింది. వల్గారిటీ లేకుండా.. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. కళ్ళు తామరపువ్వుల్లా, పెదాలు దోసకాయల్లా.. చక్కని తెలుగింటి శిల్పంగా చూడముచ్చటగా ఉంటుంది. ఈమె భర్త కూడా నటుడే. నాగార్జున నటించిన భాయ్ సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమాలో విలన్ గా కూడా నటించారు. భార్య, భర్త ఇద్దరూ కలిసి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించారు. గుర్తుపట్టారా?
ఆ అమ్మాయి ఎవరో కాదండి.. హీరోయిన్ స్నేహ. తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్నేహ.. తొలివలపు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించింది. అందంతో, అభినయంతో తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈమె ఆఖరి సారిగా హీరోయిన్ గా కనిపించిన సినిమా రాజన్న. 2011లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2012లో తమిళ హీరో ప్రసన్న వెంకటేశన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఆ మధ్య వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత స్నేహ ఆ వార్తలకు చెక్ పెట్టారు. విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చింది స్నేహ.
2014లో మళ్ళీ ఉలవచారు బిర్యానీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ.. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. సినిమాల్లోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు రియాలిటీ షోస్ కి జడ్జిగా వ్యవహరించింది. ప్రస్తుతం మలయాళంలో క్రిస్టోఫర్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మిస్టర్ అండ్ మిసెస్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అందాల రాశి.. మోడ్రన్ డ్రెస్సులు, ట్రెడిషనల్ లుక్ లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అయితే సెలబ్రిటీల చైల్డ్ హూడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటాయి. ఈ క్రమంలో స్నేహ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ ఫోటోలో స్నేహ చాలా క్యూట్ గా ఉంది. మరి చిన్నప్పుడు ఇంత క్యూట్ గా ఉన్న స్నేహపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.