టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ, గారాల పట్టి సితార గురించి తెలియనివారుండరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినా ఆమె గురించి చాలా మందికి తెలుసు. మహేష్ బాబు కూతురుగానే కాదు.. సోషల్ మీడియాలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆమెకు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. సీజన్‌కు తగినట్లు తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా, దీపావళి పండగను పురుష్కరించుకుని సితార ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
Wishing everyone a happy Diwali! Love, light, and happiness always ✨🙏 pic.twitter.com/QiX13ST5oH
— Mahesh Babu (@urstrulyMahesh) October 24, 2022
వీడియోతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ వీడియోలో ఆమె ఓ సంప్రదాయ పద్దతిలో డ్రెస్ వేసుకుని ‘‘సమస్త జననీమ్’ అనే పాటకు నాట్యం చేసింది. 1. 27 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోలో ఆమె ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 18 వేలకు పైగా లైక్స్‌ను సంపాదించుకుంది. ఇక, ఇదే వీడియోను ఆమె తండ్రి మహేష్ బాబు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, సితార తన తండ్రి తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ’ పాటకు స్పెషల్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.