మహేష్ బాబు ఒక యాడ్ లో నటిస్తే కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అయితే మహేష్ తన మొదటి కమర్షియల్ కి అంత రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదో గానీ సితార మాత్రం భారీగానే అందుకుందన్న చర్చ మొదలైంది.
సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమాలతో బిజీగా గడిపేస్తుంటే కూతురు సితార మాత్రం తండ్రికి దగ్గ కూతురిగా రికార్డులు సృష్టిస్తోంది. ఇంతకీ ఏమిటి ఆ రికార్డ్ అనుకుంటున్నారా.. చిన్న వయసులోనే యాడ్ షూట్లో పాల్గోన్న స్టార్ కిడ్‌గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. చేసింది జ్యూవెల్లరీ యాడ్ అయినా.. సితారకు పెద్ద మొత్తం ఇచ్చారని మాట్లాడుకుటున్నారు. ఇంతకీ ఎంత ఇచ్చారు.. ఏంటా విషయం.
సూపర్ స్టార్ మహేష్‌బాబు సంవత్సరానికి లేదా ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. కానీ యాడ్స్, ప్రమోషన్స్ రూపంలో మరో వైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. పాన్ మసాల దగ్గర నుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తుంటాడు. భారీ మొత్తంలో ఆర్జిస్తుంటాడు. మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్‌లో కనిపించారు. ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట. కానీ.. ఎందుకో ఒప్పుకోలేదట ఇప్పుడు మాత్రం జ్యూవెల్లరీ యాడ్‌లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో తాజగా ప్రదర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో మహేష్‌బాబు పోస్ట్ చేశాడు. కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనందపడిపోతున్నాడు.
సితారకు చాలా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోని మహేష్.. ఇలా ఈ యాడ్‌కి ఎందుకు ఒప్పుకున్నాడని మీకు సందేహం కలగవచ్చు. అయితే ఇందులో సితార యాక్ట్ చేసినందుకు ఏకంగా రూ. కోటి ఇచ్చారట. బహుశా మహేష్కూడా తన తొలి యాడ్ కోసం కూడా ఇంత తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్‌కి ఒప్పుకున్నాడేమో అన్న సినీవర్గాలో చర్చ మొదలైంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు గానీ.. ఒకవేళ నిజమైతే కనుక ఒక్క యాడ్ షూట్‌కే కోటి తీసుకుందంటే.. సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటుందో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023