సింగర్ గీతామాధురి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు కొన్ని మోస్ట్ పాపులర్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. పక్కాలోకల్, వి లవ్ బ్యాడ్ బాయ్స్, టాప్ లేసిపోద్ది, సూపర్ మచ్చి, డియో డియో.. ఇలా ఆమె కెరీర్ లో చాలా సూపర్ హిట్ ఉన్నాయి. కానీ సింగర్స్ అన్న తర్వాత ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటారని గ్యారెంటీ లేదు. కానీ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో పేరు పెద్దగా వినిపించక పోయేసరికి జనాలు కూడా మర్చిపోతుంటారు.
కానీ గీతామాధురి తాజాగా మరో సాంగ్ తో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నటసింహం బాలయ్య నటించిన అఖండ సినిమాలో ‘జై బాలయ్య’ అనే సాంగ్ పాడింది. అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. జై బాలయ్య పాట కూడా అంతే పాపులర్ అయింది. చాలా రోజుల తరువాత గీతామాధురి నుండి ఓ ఊపున్న పాట విన్నామని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవల గీతామాధురి బాలయ్య సాంగ్ హిట్ అవ్వడంతో స్పందించి.. ‘అన్ని పాటలను నిబద్దతతోనే పాడతాము. కానీ కొన్ని హిట్ అవుతాయ్.. ఇంకొన్ని అవ్వవు. అయితే.. ఎప్పుడు కూడా పాటకు ఇంత ఇవ్వండని ఎవ్వరినీ డిమాండ్ చేయలేదు. ఒకవేళ పాటకు ఇంత అని డిమాండ్ చేస్తే తట్టుకోలేరు. అదీగాక డిమాండ్ చేస్తే.. నువ్ కూడా అడుగుతున్నావా? అని అంటారు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ మా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారు. ఈ జై బాలయ్య పాటకి కూడా తమన్ గారే ఇంత అని ఫిక్స్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. మరి స్టార్ సింగర్ అయినటువంటి గీతామాధురి.. సూపర్ ఫామ్ లో ఉన్నాకూడా సొంతంగా రెమ్యూనరేషన్ ఇంత అని అడగలేని కష్టాలలో ఉందా? అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి గీతా పాడిన జై బాలయ్య పాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.