టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రధానపాత్రలలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్‘. గత డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా నాని కెరీర్ లోనే డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటిటి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
జనవరి 21న నెట్ ఫ్లిక్స్(Netflix)లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన ఈ సినిమాని ఓటిటి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు మేకర్స్ తాజాగా శ్యామ్ సింగరాయ్ నుండి ఓ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు.
నిమిషంలోపే నిడివి ఉన్న ఆ సీన్ లో నాని.. వేశ్యల మధ్యలో కూర్చొని పుస్తకంలోని రొమాంటిక్ లైన్లు గట్టిగా చదువుతుంటాడు. అదే సమయంలో ఓ వేశ్య తనని పెళ్లి చేసుకోవచ్చుగా అంటుంది. దానికి నాని స్పందించి.. ‘ఖచ్చితంగా చేసుకుంటా.. నిన్ను ప్రేమించినప్పుడు’ అంటూ చెప్పడం విశేషం. ఎంతో ఇంటెన్సిటీతో కూడిన ఈ సీన్ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. మరి ఈ డిలేటెడ్ సీన్ పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.