టీం ఇండియా సంచలన క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఎట్టకేలకు తన మనసులో ఉన్న యువరాణి పేరు బయట పెట్టాడు. సచిన్ కుమార్తె లేదా నటి సారా అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమార్లు రాగా, తన క్రష్ ఎవరూ అన్నదీ చెప్పేశాడు.
టీమ్ ఇండియా క్రికెటర్లు, నటీమణులతో ప్రేమాయణం నడపడం కొత్తేమీ కాదు. ఎప్పుడు నుండో క్రికెటర్లకు, నటీనటులకు మధ్య మంచి సంబంధాలున్నాయి. కొన్ని ప్రేమలు పెళ్లి పీటల వరకు ఎక్కుతుంటే.. మరికొన్ని మధ్యలోనే అంతమైపోతాయి. ఇప్పటి టీంలో కూడా చాలా మంది క్రికెటర్లు నటీమణులతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్న వారున్నారు. కోహ్లీ-అనుష్క, హార్థిక్ పాండ్య-నటాసా స్టాంకోవిచ్, కె.ఎల్ రాహుల్-అతియా శెట్టి ఆ కోవకు చెందిన వారే. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా ఓ నటి ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అతడే నయా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని, నటి సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు రావడంతో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పేశాడు. ఓ మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్న శుభ్ మన్ గిల్‌ను మీ క్రష్ ఎవరూ అన్న ప్రశ్న ఎదురు కాగా, తొలుత ప్రశ్న దాట వేసేందుకు ప్రయత్నించాడు. మళ్లీ అడగ్గా.. నటి రష్మిక మందన్న పేరు చెప్పేశాడు. తనపై నాకు క్రష్ ఉందని అన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరిలో ఎవరి పేరైనా చెబుతాడు అనుకుంటే.. ఇలా మరొకరి పేరు చెప్పడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. అయితే దీనిపై పలు కామెంట్లు వస్తున్నాయి. బ్రో విజయ్ దేవరకొండకు అన్యాయం చేస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై మన పుష్ప భామ రష్మిక స్పందించాల్సి ఉంది.
కన్నడ సీమ నుండి తెలుగు సీమకు అడుగు పెట్టిన ఈ చిన్నదీ.. పుష్ప మూవీతో బాలీవుడ్ లోనూ పాగా వేసిన సంగతి విదితమే. సారా వర్కెస్ సారా రూమర్లతో విసిగిపోయి.. ఇలా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడో కూడా శుభ్ మన్ గిల్‌కే తెలియాలి. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు గిల్. అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ లో 208(149), 40 నాటౌట్(53), 112(78)లతో 360 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా శుభ్ మన్ గిల్‌కు సెంచరీ ఉంది.