సెలబ్రిటీల ఇంట పెళ్లి వేడుక అంటే ఎంత ఘనంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన పెళ్లి ఖర్చుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
సెలబ్రిటీల ఇంట పెళ్లి అంటే ఎంత భారీగా ఖర్చు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెడతారు. అవును మరి పెళ్లి అంటే జీవితంలో ఒకే సారి జరిగే అపురూపమైన అరుదైన వేడుక. ఈ సందర్భాన్ని జీవితాంతం మర్చి పోలేని మధుర జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ఎంత ఖర్చైనా చేస్తారు. ఇక నేటి కాలంలో సామాన్యల ఇంట జరిగే వివాహ వేడుకకే భారీగా ఖర్చు చేస్తున్నారు. అలాంటిది సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల ఇంట పెళ్లి అంటే ఎంత ఘనంగా జరుగుతుందో.. ఎంత ఖర్చు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిరల్ శర్వానంద్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఆయనకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా శర్వా పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్.. త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. త్వరలోనే శర్వా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇక శర్వానంద్.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని సమాచారం. రక్షితా రెడ్డి అనే యువతిని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శర్వా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్-రక్షిత వివాహం జరగనుందని సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వేదిక రాజస్థాన్. ఇక శర్వా కూడా రాజస్థాన్‌లో రాయల్‌గా వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
శర్వా పెళ్లి వేడుకలో భాగంగా జూన్ 2న మెహందీ, సంగీత్ ఫంక్షన్ నిర్వహిస్తారని.. 3వ తేదీన శర్వా-రక్షితా పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఇక రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఈ ప్యాలెస్‌లో పెళ్లి అంటే కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలానే శర్వా కూడా తన పెళ్లి కోసం భారీగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా సహా పలు వెబ్సైట్ల కథనం ప్రకారం.. సదరు ప్యాలెస్‌లో ఒక్క రోజుకు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ రెండు రోజలు పెళ్లికి గాను శర్వా మొత్తంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతన్నట్లు తెలుస్తోంది.
కోట్ల ఖర్చుతో.. అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ రాయల్ వెడ్డింగ్‌కి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం. మెగా దంపతులు రామ్‌చరణ్ ఉపాసన జోడి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్ చివరి సారిగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో నటించారు. అది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు రవితేజతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది.