సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. దానిలో భాగంగా శనివారం (మే 7) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబుతో పాటు కీర్తి సురేశ్, పరశురాం, దర్శకులు సుకుమార్, వంశీపైడిపల్లి తదితరులు పాల్గొని సందడి చేశారు.
ఇది కూడా చదవండి: Puri Jagannadh: ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ పై పూరి జగన్నాథ్ రియాక్షన్ ఏంటంటే..?
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. మరీ ముఖ్యంగా అన్న రమేష్ బాబును తల్చుకుని స్టేజీ మీదే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..’ అంటూ మహేశ్‌బాబు ఎమోషనల్ అయ్యారు. కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు అన్నయ్య రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్‌బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు. ఆ విషయాన్ని తల్చుకుని మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Parasuram: ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ డైలాగ్.. పరశురామ్ ఏమన్నారంటే