టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో తాను డేటింగ్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై హీరోయిన్ సారా అలీఖాన్ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో మంచి ఫేమ్ ఉన్నవారిలో సారా అలీ ఖాన్ ఒకరు. సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన సారా.. ‘కేదార్నాథ్’ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కానప్పటికీ నటిగా సారాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘సింబా’తో ఆమె సూపర్ హిట్ కొట్టారు. ధనుష్ సరసన నటించిన ‘అత్రంగీ రే’ చిత్రంతో సారాలోని అసలైన నటన బయటపడింది. అందంతో పాటు ఆమె అభినయంతోనూ ఆకట్టుకోగలదని ఈ సినిమా నిరూపించింది. ప్రస్తుతం ‘మెట్రో ఇన్ దినో’ మూవీలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. అయితే సారా విషయంలో కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అప్పట్లో ఆమె ప్రేమాయణం నడిపారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్‌తో సారా లవ్‌లో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి.
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో సారా అలీ ఖాన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గిల్‌తో డేటింగ్ రూమర్స్‌పై సారా తాజాగా స్పందించారు. క్రికెటర్‌ను మ్యారేజ్ చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారామె. అయితే, ఒక కండీషన్ మాత్రం పెట్టారు. ‘నా మానసిక, ఆధ్యాత్మక విలువలకు సరితూగే వ్యక్తి దొరికితే తప్పకుండా జీవితాన్ని మొదలుపెడతా. ఆ వ్యక్తి ఏ రంగానికి చెందిన వాడనేది నేను పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, యాక్టర్, బిజినెస్‌మన్.. ఇలా ఏ రంగమైనా పర్వాలేదు. నేను పాటించే విలువలను గౌరవిస్తే చాలు’ అని సారా చెప్పుకొచ్చారు. గిల్‌తో డేటింగ్‌పై స్పందిస్తూ.. జీవిత భాగస్వామిని తాను ఇంకా కలవలేదన్నారు. కలిశానని కూడా తాను అనుకోవడం లేదన్నారామె. ఇది పూర్తి భరోసాతో చెబుతున్నానని సారా స్పష్టం చేశారు.