హీరోయిన్ సంయుక్తా మీనన్ తెలుగులో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయారు. తక్కువ సినిమాలే చేసినా.. అవన్నీ మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఒక రేంజ్లో పాపులారిటీ వచ్చింది.
టాలీవుడ్లో తక్కువ వ్యవధిలో స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తా మీనన్‌ను చెప్పుకోవచ్చు. ఈ మలయాళీ భామ పట్టుకుందల్లా బంగారం అవుతోంది. ఆమె తెలుగులో ఇప్పటివరకు నటించిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో సంయుక్తది గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. బడా నిర్మాతలు ఆమె వైపు చూస్తున్నారు. సంయుక్త తమ మూవీస్‌లో నటిస్తే హిట్ వస్తుందన్న ఆశతో కాబోలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సంయుక్త. ఇందులో ఆమె పాత్రకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అప్లాజ్ లభించింది. ఆకట్టుకునే అందం, అందరూ మెచ్చే నటనతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంయుక్త.. తనకు మంచి మనసు కూడా ఉందని చాటుకున్నారు.
తాజాగా తెలుగులో ఒక రియాలిటీ షోలో పాల్గొన్న సంయుక్త మీనన్.. ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్‌కు మర్చిపోలేని బహుమతులు ఇచ్చారు. ‘విరూపాక్ష’ మూవీ యూనిట్‌తో కలసి ఓంకార్ నిర్వహిస్తున్న ‘సిక్త్ సెన్స్’ షోలో పాల్గొన్నారామె. ఈ షోలో అన్ని టాస్క్‌లు గెలిస్తే స్కూటీ ఇస్తానని ఓంకార్ మాటిచ్చారు. అయితే ‘విరూపాక్ష’ చిత్ర యూనిట్ ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న విద్యార్థుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తామని చెప్పారు. అన్ని టాస్కుల్లోనూ గెలవడంతో ఓంకార్ ఒక స్కూటీ ఇచ్చారు. ఈ స్కూటీని ఎవరికిస్తారని ఆయన అడిగారు. దీంతో స్టూడెంట్స్‌లో ఇద్దర్ని సెలెక్ట్ చేశారు సంయుక్త. వారిలో ఒకరికి ఆమె స్కూటీ ఇచ్చేశారు. మరో అమ్మాయికి తానే స్కూటీ కొనిస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు సంయుక్తను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు. సంయుక్త మంచి మనసును నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. బ్యూటీ విత్ హార్ట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Very smart & kind hearted woman @iamsamyuktha_ take a bow 🙇♂️ 👏#Virupaksha #Samyukthamenon pic.twitter.com/K8ZT3lqghq
— 🦁 (@CM_Lokeshh) May 1, 2023