చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి ఫెర్మామెన్స్‌తో ఆకట్టుకుంటారు కొంత మంది నటులు. అటువంటి వారిలో ఒకరు అశ్విన్ బాబు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడే ఈ అశ్విన్. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చిన అశ్విన్‌ను పరిచయమైంది అన్నయ్య సినిమాతోనే. జీనియస్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమ్యారు. రాజుగాది సిరీస్ చేశారు. ఇప్పుడు హిడింబ ద్వారా రాబోతున్నారు.
బుల్లితెరలో ప్రసారమౌతున్న షోల్లో ఒకటి సిక్త్ సెన్స్, ప్రస్తుతం సీజన్ సిక్స్ నడుస్తుంది. ఓంకార్ యాంకరింగ్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన వన్ సెకన్ మేనరిజమ్ తో ఆట ఆడేందుకు వచ్చిన వారికి చెమటలు పట్టిస్తున్నారు ఓంకార్. ఇప్పుడు మరో రెండు టీములతో రాబోతున్నారు మన ఓంకార్ అన్నయ్య. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, కాస్త ఫన్, కాస్త శాడ్ కనిపించింది.
నటి కస్తూరి శంకర్ అంటే తెలియక పోవచ్చు కానీ గృహలక్ష్మిలో తులసి అంటే ఎవ్వరైనా గుర్తు పట్టేస్తారు. కస్తూరి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటూంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె
హీరోయిన్ సంయుక్తా మీనన్ తెలుగులో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయారు. తక్కువ సినిమాలే చేసినా.. అవన్నీ మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఒక రేంజ్లో పాపులారిటీ వచ్చింది.
తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. ఇందులో బిగ్ బాస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ కి మొదట ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, ప్రస్తుతం వరుసగా కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు.
ఆట, మాయాద్వీపం వంటి రియాలిటీ షోస్‌తో తెలుగు బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన ఓంకార్‌పై ఆట సందీప్ సతీమణి జ్యోతిరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓంకార్ షోల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే వారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం వీళ్ళ గురించే జ్యోతిరాజ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓంకార్‌ను ఉద్దేశించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ప్రస్తుతం […]