తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారిలో ప్రేక్షుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం కొందరే. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉంటుంది అందాల భామ సమంత. ఈ మధ్య కాలంలో ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక్కటే వార్త.. సమంతకు ఏమైంది? ఎందుకు చేతికి సెలైన్ పెట్టుకుని, డాక్టర్ సమక్షంలో ఎందుకు డబ్బింగ్ చెబుతోంది? అన్న వార్తలు వైరల్ గా మారాయి. వాటన్నింటీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది సమంత. నవంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది ‘యశోద’ మూవీ. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా సుమ తో కలిసి చిత్రానికి సంబంధించిన ముచ్చట్లతో పాటుగా తొలిసారిగా తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చింది. ఒకానొక దశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేస్తానని అనుకోలేదని చెప్తూ.. భావోద్వేగానికి గురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సమంత.. తెలుగు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సామ్.. నవంబర్ 11న యశోద అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి వస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా సుమతో కలిసి ఓ ఇంటర్య్వూలో పాల్గొంది సమంత. ఈ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై తొలిసారిగా స్పందించింది. తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. కన్నీరు కార్చింది. తన ఆరోగ్యంపై సమంత మాట్లాడుతూ..”నా జీవితంలో ఒకానొక దశలో ఆ రోజు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనోమో అనిపించేది. అందుకే నా పోస్ట్ లో కొన్ని రోజులు మంచి రోజులు.. కొన్ని రోజులు కష్టాలు పడాలి అని రాసుకొచ్చాను. నా గతంలోకి చూసుకుంటే నేనేనా ఇవన్నీ దాటుకు వచ్చింది” అంటూ భావోద్వేగానికి గురై కన్నీరు కార్చింది.
#Samantha opens up about handling her health issues. #Yashoda #YashodaTheMovie pic.twitter.com/r2Xc3uUuKT
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) November 8, 2022
ఈ క్రమంలోనే ఇప్పుడు నేను పోరాటం చేస్తున్నానని, చాలా మందితో యుద్ధాలు చేశానని సమంత చెప్పుకొచ్చారు. కానీ చివరికి మాత్రం నేనే గెలుస్తానని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక నా ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలను చూశాను.. వాటిల్లో సమంతకు లైఫ్ థ్రెట్టింగ్ అని రాసుకొచ్చారు.. ప్రస్తుతానికైతే నాకు అలాంటి పరిస్థితి ఏమీ లేదని సమంత స్పష్టం చేసింది. ఇప్పటి వరకైతే నేను బతికే ఉన్నాను అంటూ నవ్వులు చిందించింది. అలా రాసే వాళ్ల గురించి నేను పట్టించుకోను.. కాక పోతే ఆ పరిస్థితులు వెరీ డిఫికల్ట్ అంటూ వివరించింది. ప్రస్తుతానికైతే నేను వాటిపై పోరాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక యశోద మూవీని కథ విన్న వెంటనే ఒకే చేశానని, ఇదొక అద్బుతమైన స్టోరి అని తెలిపింది. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది.