కొంతమంది డేడికేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు తమ వృత్తిని ఆరాధిస్తుంటారు. ఎంత కష్టమొచ్చినా కూడా తమ వల్ల పని ఆగకూడదు అని భావిస్తుంటారు. అంటే అతిశయోక్తి అవుతుందేమో.. కట్టెల మీద కాలేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అద్భుతం జరిగి బతికి బట్టగడితే.. ఫస్ట్ మాట్లాడే మాట ‘పని ఎంత వరకూ వచ్చింది’ అనే. ఉంటారండీ కొంతమంది వర్క్ హాలిక్ లు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి. 102 ఫీవర్ ఉన్నా కూడా ఒక సినిమా పాట కోసం డ్యాన్స్ వేశారు. మళ్ళీ డేట్స్ సర్దుబాటు అవుతాయో లేదో, తమ వల్ల నిర్మాత నష్టపోకూడదని ఆలోచిస్తుంటారు. మెగాస్టార్ లు, నట సింహాలు ఊరికే అయిపోతారా చెప్పండి. తాజాగా టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ సమంత కూడా వర్క్ పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించుకుంది. ఈ విషయాన్ని యశోద సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. అయితే మాయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమంత చికిత్స చేయించుకుంటున్న కారణంగా యశోద ప్రమోషన్ కి దూరంగా ఉంది. ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యశోద సినిమా కథ విన్న తర్వాత.. ఈ కథకి సమంత మాత్రమే న్యాయం చేయగలదని తనకి అనిపించిందని నిర్మాత అన్నారు. ఆమెకు కథ చెప్పగానే వెంటనే అంగీకరించిందని వెల్లడించారు. ఇక సమంత ఆరోగ్యం గురించి కూడా ఆయన స్పందించారు. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పే సమయంలోనే సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతోందని, ఆ విషయం తమకు సమంత సోషల్ మీడియా వేదికగా చెప్పడానికి 4 రోజుల ముందు తెలిసిందని అన్నారు.
యశోద సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం పూర్తయిపోయింది. డబ్బింగ్ వర్క్ ఒకటి మిగిలి ఉంది. అయితే ఇంత బాధలో కూడా తెలుగు వెర్షన్ కి తనే డబ్బింగ్ చెప్పిందని నిర్మాత అన్నారు. ఇక తమిళ వెర్షన్ డబ్బింగ్ వేరే వారితో చెప్పిస్తానని నిర్మాత అన్నప్పటికీ.. సమంత ఒప్పుకోలేదని అన్నారు. తన వాయిస్ తమిళ ప్రేక్షకులకి తెలుసని, అందుకే తమిళ్ వెర్షన్ కి కూడా తానే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకుందని అన్నారు. ఒక డాక్టర్ ని పక్కన పెట్టుకుని 4 రోజుల పాటు డబ్బింగ్ చెప్పిందని, సమంత డెడికేషన్ అట్లుంటది అంటూ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల పట్ల సమంతకున్న డెడికేషన్ కి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.