గతేడాది స్టార్ హీరోయిన్ తో విడాకుల అనంతరం పూర్తిగా సినీ కెరీర్ పై దృష్టిపెట్టాడు అక్కినేని హీరో నాగచైతన్య. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్ధా’ మూవీతో చైతూ బాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘థాంక్యూ’ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అలాగే విక్రమ్ కుమార్ తోనే ఓ వెబ్ సిరీస్ లైనప్ చేసుకున్నాడు. మొత్తానికి అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ తో బిజీ అయిపోయాడు చైతూ.
ఈ క్రమంలో తాజాగా నాగచైతన్యకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. నాగచైతన్య రెండో పెళ్లి. కొద్దిరోజులుగా నాగచైతన్యకు రెండో పెళ్లి అంటూ పలు ప్రముఖ వెబ్ సైట్స్ కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే చైతూ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని.. చైతూకి, అఖిల్ కి ఒకేసారి పెళ్లి చేసేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. నాగార్జున అఖిల్ కోసం ఓ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని, నాగచైతన్య మళ్లీ ఓ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. అఖిల్ పెళ్లి ఏమోగానీ చైతూ లవ్ మేటర్ మాత్రం నాగ్ చెవిన పడిందంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. లవ్ కంఫర్మ్ చేస్తే అఖిల్ తో పాటు చైతూ పెళ్లి కూడా ఒకేసారి జరిపించాలని నాగ్ ఆలోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇక ఇవన్నీ వట్టి మాటలని.. రూమర్స్ అంటూ అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలవారు కొట్టిపారేస్తున్నారట. ప్రస్తుతం నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కెరీర్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. చివరిసారి చైతూ ‘బంగార్రాజు’ సినిమాలో కనిపించాడు. త్వరలోనే థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి నాగచైతన్య రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి అక్కినేని నాగచైతన్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.