దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన ఫస్ట్ డే నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూల్ చేసింది.
ఈ సినిమా బ్రిటిషర్స్ కాలంలో సాగుతుంది. కాబట్టి సినిమాలో బ్రిటిష్ ఇంగ్లీష్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో బ్రిటిషర్స్ మాట్లాడే ఇంగ్లీష్ తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం లేదని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ విషయం కాస్తా ట్రిపుల్ ఆర్ టీమ్ చెవినపడి.. కీలక మార్పులకు దారితీసింది. తాజా సమాచారం ప్రకారం.. మాస్ ఆడియెన్స్ కోసం ప్రధాన బీసీ సెంటర్ లలో బ్రిటిష్ ఇంగ్లీష్ డైలాగులకు.. తెలుగు ఆడియో ట్రాక్(వాయిస్ ఓవర్) యాడ్ చేయనున్నారు.ఇది ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సినిమాలో బ్రిటిషర్స్ మాట్లాడే మాటలు అర్థం కాలేదని బాధపడిన వారందరూ ఇప్పుడు సినిమాను మరింత బాగా అర్థం చేసుకోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. మరి ట్రిపుల్ ఆర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.