ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన వారందరికీ సినిమాల్లో ఎన్నో అంశాలు నచ్చి ఉండొచ్చు. కానీ అందులో నాటు నాటు సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాటలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల డ్యాన్స్ ఫ్యాన్స్ తో ఏ రేంజిలో విజిల్స్ వేయించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. థియేటర్లలో ఈ పాటను కళ్లారా చూసినవారంతా ఎప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే అప్పుడు మళ్లీ మళ్లీ చూసేందుకు రెడీగా ఉంటారు. ఆ సాంగ్ లో ఉన్న మ్యాజిక్ అలాంటిది.
ఇక తాజాగా నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. థియేటర్లలో మిస్ అయినవారంతా యూట్యూబ్ లో ఎన్టీఆర్, చరణ్ డాన్స్, ఎనర్జీలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. నాటు పాటకు ఊరనాటు స్టెప్పులతో అదరగొట్టేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. ఇటీవలే కలెక్షన్స్ పరంగా రూ. 1000కోట్ల జాబితాలో చేరింది. ఈ సినిమాను దానయ్య నిర్మించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరి నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.