RRR దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీ ఇది. మరో కొన్ని గంటల్లో ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కథ గురించి గతంలో చాలానే వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లు అంటూ తేలిపోయాయి. కానీ.. ఇప్పుడు వైరల్ అవుతున్న స్టోరీ మాత్రం చాలా వరకు ప్రమోషనల్ వీడియోలకు మ్యాచ్ అవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో లీకైన ఆర్.ఆర్.ఆర్ అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్.ఆర్.ఆర్ కథ.. నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో కథ మొదలవుతుంది. అక్కడ.. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటీష్ దొర ఓ గొండ్ల పిల్లని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ.. ఆ తెగకి ఓ కాపరి ఉంటాడు. అతనే కొమరం భీం. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవి తల్లినే అమ్మగా చేసుకున్న ధీరుడు కొమరం భీం. ఆ అడవిలోని పులైనా సరే అతని సత్తా ముందు చిన్న బోవాల్సిందే. అలాంటి కొమరం భీం తమ గూడెం బిడ్డని వెతుక్కుంటూ.. దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెడతాడు. తమ కోసం వచ్చిన కొమరం భీంని పట్టుకునే బాధ్యత రామరాజుకు అప్పగిస్తారు బ్రిటీష్ వారు. ఎదురుగా వేలమంది ఉన్నా.. ఒంటి చేత్తో అందరిని మట్టి కరిపించగల శక్తివంతుడు రామరాజు. అతని ప్రళయాగ్ని లాంటి కోపం ముందు ఎవ్వరూ నిలవలేరు.రామరాజు.. కొమరం భీంని పట్టుకోవడంలో విఫలం అవుతాడు. చేతగాక కాదు.. కొమరం భీంలోని నిజాయతి, అమాయకత్వం నచ్చి. రామరాజు సాయంతో భీం.. తమ గొండ్ల బిడ్డని గూడెంకి చేరుస్తాడు. అయితే.. బ్రిటీష్ కి ఎదురుతిరిగి, తమ శత్రువుకి సాయం చేసి, ఆ బిడ్డని గూడెంకి చేర్చిన రామరాజుకు బ్రిటీష్ ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. ఇవేమి తెలియని భీం.. ఓ నాడు సీతని కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది తిని, ఆకలి తీర్చుకున్న భీం.. ఆ అమ్మ కష్టం తెలుసుకుంటాడు. మనసై, మనువాడిన వాడు ఉరి కంభం ఎక్కబోతున్నాడు అని సీత కన్నీరు పెట్టుకుంటుంది.
తనకు సాయం చేసిన పాపానికి.. రామరాజుని ఉరి తీయబోతున్నారు అని భీంకి అప్పుడు అర్ధం అవుతుంది. దీంతో.. సీతకి భీం మాట ఇస్తాడు. “అమ్మ.. నీ భర్త రాముడు అంటి స్వచ్ఛమైన మనసు కలిగినవాడు. నా కష్టాన్ని తీర్చే క్రమంలోనే అతను ఈ ఇబ్బందిలో చిక్కాడు. రాముడుకి కష్టం వస్తే వెళ్ళాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు” అంటూ.. కొమరం భీం మళ్ళీ బ్రిటీష్ పై పోరాటానికి వెళ్తాడు. అక్కడ భీం.. రామరాజుని జైలు నుండి తప్పిస్తాడు. ఇక్కడ నుండి వీరి స్నేహం మొదలవుతుంది.బ్రిటీష్ వారి నుండి తప్పించుకున్న రామరాజు, కొమరం భీం.. తమ ఐడెంటిటీని మార్చుకుని అజయ్ దేవగణ్ వద్దకి చేరుకుంటారు. కానీ.. అజయ్ దేవగణ్ అప్పటికే బ్రిటీష్ వారితో పోరాటం చేస్తుంటాడు. అక్కడ.. అజయ్ దేవగణ్ వీరిని యుద్ధ వీరులుగా తీర్చిదిద్దుతాడు. దీంతో.. భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి.. కొమరం భీం, రామరాజు బ్రిటీష్ సైన్యంపై యుద్దానికి దిగుతారు. సుదీర్ఘంగా సాగే ఈ పోరాటంలో భీంకి కళ్ళు, రామరాజుకు కాళ్లు పోతాయి. అయినా.. వీరు పోరాటం ఆపకుండా ఒకరిపై మరొకరు ఎక్కి.. యుద్దాన్ని కొనసాగిస్తారు. ఈ పోరాటం చివరికి ఏ మలుపు తీసుకుంటుంది? చివరికి.. భీం, రామరాజు ఏమవుతారు అన్నదే RRR అసలు కథ. మరి.. స్టోరీ లైన్ ఇదే అయితే.. ట్రిపుల్ ఆర్ ఎంతటి విజయాన్ని అందుకుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
( ముఖ్య గమనిక: ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ మాత్రమే. దానినే యధావిధిగా అందించడం జరిగింది)