RRR: సినిమా అనేది ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లే మాయ. అందులో గొప్పగొప్ప పాత్రలు ఎదురవుతుంటాయి. ఎన్నో భావోద్వేగాలు, సెంటిమెంట్, లవ్, కామెడీ ఇలా ప్రతిదీ తెరపై కల్పితమే. కానీ.. ప్రేక్షకులకు ఎక్కడకూడా ఇది కల్పితం అనిపించకుండా.. రియలిస్టిక్ గా ఆ సన్నివేశంలోని ఎమోషన్స్ ప్రేక్షకులను హత్తుకునేలా ఆవిష్కరిస్తుంటారు మేకర్స్. అయితే.. సినిమా అన్నాక ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఎమోషన్స్ కి కోరుకుంటారు సినిమా లవర్స్.
ఇక ప్రేక్షకులను, ఇప్పుడున్న ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు సెంటిమెంటల్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఇప్పుడు భారీ యాక్షన్, మాస్ సినిమాలను ఇష్టపడుతున్నారు జనాలు. ఎప్పుడైనా దర్శకనిర్మాతల టార్గెట్ ప్రేక్షకులను మెప్పించడమే కాబట్టి.. ప్రెజెంట్ వారు కోరుకునే అద్భుతమైన విజువల్స్ తో కూడిన సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటారు.
ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్‘ మూవీ ముందువరుసలో ఉంటుంది. బాహుబలితో మాహిష్మతి అనే విజువల్ వరల్డ్ ని క్రియేట్ చేసిన రాజమౌళి.. ఈసారి ఆర్ఆర్ఆర్ తో తెరపై ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవితకథల నేపథ్యంలో ఓ పీరియాడిక్ ఫ్రెండ్ షిప్ ని చూపించే ప్రయత్నం చేశాడు. బాహుబలితో ప్రభాస్ ని, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియాకి పరిచయం చేశాడు రాజమౌళి.
మొత్తానికి ఎన్టీఆర్, చరణ్ లతో ఆర్ఆర్ఆర్ ని పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెరపై ప్రెజెంట్ చేయడమే కాకుండా.. 1150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అయితే.. ఎంత పీరియాడిక్ మూవీ అయినా.. ఇద్దరు హీరోలు ఉన్నా.. ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఊహించని స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు రాజమౌళి. దాదాపు ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ భారీ స్థాయిలో ఉపయోగించారు.
మగధీర, ఈగ, బాహుబలి సినిమాలలో భీభత్సమైన గ్రాఫిక్స్ వాడాడు రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ ఏమైనా కొత్తనా అనిపించవచ్చు. కానీ.. ట్రిపుల్ ఆర్ అనేది పీక్స్ లో సృష్టించారు. ఈ సినిమాలో మొదటి నుండి చివరివరకూ యాక్షన్ సీన్స్ భారీ లెవెల్ లో ఉండడానికి కారణం విజువల్ వర్క్. అంటే.. తెరమీద అద్భుతాలన్నీ తెరవెనుకే క్రియేట్ అవుతాయి. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసినప్పటికీ, రాజమౌళి సినిమాలకు ఏమి ఆలోచించకుండా పరిగెడతారు.
ట్రిపుల్ ఆర్ లో ఆ రేంజి క్రియేటివిటీని చూపించాడు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా, చరణ్ అల్లూరి పాత్రలలో కనిపించారు. అయితే.. సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతుండగా.. జెండాను ఎత్తిపట్టి నిలబడిన చిన్న షాట్ ఒకటి ప్రమోషన్స్ లో వైరల్ అయ్యింది. కానీ.. తీరా థియేటర్లో సినిమా చూసేసరికి అందులో ఆ సీన్ ఎక్కడా కనిపించలేదు. అంటే.. కేవలం ప్రమోషన్స్ కోసమే ఆ అలలు ఎగసిపడే షాట్ ని వాడారు మేకర్స్.
ప్రస్తుతం ఎన్టీఆర్ సముద్రతీరంలో జెండాతో నిలబడిన షాట్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీజీ సీన్స్ అన్నీ మ్యాట్ పై షూట్ చేస్తారనే సంగతి తెలిసిందే. కానీ.. ఎలా తీశారు? మేకింగ్ విధానం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ షాట్ లో ఎన్టీఆర్ మ్యాట్స్ మధ్య నటించిన విధానం చూడవచ్చు. ఆ తర్వాత ఎడిటింగ్ అయిపోయాక వచ్చే సీన్ మీరు ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోలో చూశారు. మరి ఈ షాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.