దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR’ మార్చి 18న రిలీజ్ ఆలోచనను విరమించుకున్నారు. మూవీ యూనిట్ తాజాగా కొత్త డేట్ ని ప్రకటించింది. నిజానికి RRR రిలీజ్ కోసం రెండు తేదీ(మార్చి 18, ఏప్రిల్ 28)లను ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.., కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. మార్చి 18న RRR సినిమాని రిలీజ్ చేయలేరు. ఎందుకంటే.. ఆ రెండు వారాల్లో పునీత్ రాజ్ కుమార్ సినిమాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కాబట్టి, RRR సినిమాని మార్చి 25న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ఇప్పటికే నాలుగు సార్లు పోస్ట్ ఫోన్ అయిన నేపథ్యంలో ఈ డేట్ కైనా మూవీ రిలీజ్ అవుతుందా? లేదా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈసారైనా ట్రిపుల్ ఆర్ అనుకున్న డేట్ కి రిలీజ్ అవుద్దా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RRRonMarch25th, 2022… FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
— RRR Movie (@RRRMovie) January 31, 2022