‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందనే చెప్పాలి. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనగానే అందరి దృష్టి కొట్టుకోవడం పైనే ఉంది. 24/7 నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అన్నారు కానీ, ప్రతిసారి ఏదొకి రీజన్ తో లైవ్ స్ట్రీమ్ ను ఆపేస్తున్నారు. ఈ ఆదివారం కూడా ఏదో సెట్ ఏర్పాటు ఉందని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఆపేశారు. ఆదివారం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎలిమినేషన్ అవును ప్రతివారం ఇంటి నుంచి ఒకరు బయకు అయితే వెళ్లాలి. అయితే ఈ వారం ఓ షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. నామినేషన్లో ఉన్న 12 మందిలో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్!
ఇప్పటికే ఇంటి నుంచి ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆర్జే చైతు చేరినట్లు తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే ఆర్టే చైతు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ నుంచి ఎలిమినేట్ అయినట్లు లీకులు అందాయి. అదే నిజమైతే నిజంగానే షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. హౌస్ లో ఛాలెంజర్స్ తరఫున స్ట్రాంగ్ వాయిస్ వినిపించే ఆర్జే చైతు ఎలిమినేషన్ అనగానే ఫ్యాన్స్ మాత్రమే కాదు.. చాలా మంది ప్రేక్షకులు కూడా నమ్మలేకున్నారు. మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ తో ఎంత షాకయ్యారు. ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న ఆర్జే చైతు ఎలిమినేట్ అవ్వడంతో అంతకు రెట్టింపు షాక్ లో ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అయితే ఆర్జే చైతు ఎలిమినేషన్ పై బయట భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆర్జే చైతు ఎలిమినేషన్ సరైంది కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఆర్జే చైతు అప్పుడు కొబ్బరికాయలు టాస్కులో సంచాలక్ గా, బిందు మాధవి ప్లేట్ విసిరేసినప్పుడు ఆమెకు సపోర్ట్ గా నిలిచినప్పటి నుంచి ప్రేక్షకుల్లో నెగెటివ్ అయ్యాడు అందే ఎలిమినేట్ అయ్యాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఎలిమినేషన్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది అని చెబుతారు. మరి ఆర్జే చైతుకు అన్ని తక్కువ ఓట్లు పడ్డాయో ఏమో తెలియని విషయం. ఆర్జే చైతు ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.