బిగ్ బాస్ లో ఎన్ని గొడవలు జరిగినా, ఎంత రచ్చ అవుతున్నా సరే ఒక టైప్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం హౌస్ మేట్స్ మధ్య రిలేషన్ షిప్, ప్రేమ వ్యవహారాలు లాంటి వాటి కోసం చూస్తుంటారు. ప్రస్తుతమైతే షోలో ఓవైపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సడన్ గా ఎలిమినేట్ అయిపోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ టెన్షన్. ఇంత జరుగుతున్నా సరే కొందరు హౌస్ మేట్స్ మాత్రం తన స్టైల్లోనే లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయమే షోలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లకు కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంలో ప్రసారమైన వాటితో పోలిస్తే బిగ్ బాస్ ఆరో సీజన్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 75వ రోజుకు చేరుకున్నా సరే ఆడియెన్స్ నుంచి అంతంత మాత్రంగానే రెస్పాన్ ఉంది. గతవారం గీతూ, అంతకు ముందు ఆర్జే సూర్య ఎలిమినేట్ అయిపోవడం కూడా షోపై ఇంట్రెస్ట్ తగ్గించేలా చేస్తోందని పలువురు నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే టాప్-5లో ఉంటారనుకున్నా వీళ్లిద్దరూ కూడా వరస వారాల్లో ఎలిమినేట్ అయిపోవడం అందరికీ నిజంగా పెద్ద షాక్. ఇక నెక్స్ట్ వికెట్ ఎవరిది పడుతుందా అని హౌస్ మేట్స్ అందరిలోనూ ఒకటే టెన్షన్. ఇకపోతే ఈ వారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో శ్రీ సత్య, శ్రీహాన్ కూడా ఉన్నారు.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్'(బయటకు వెళ్లిపోకుండా చేసే పాస్) గురించి బిగ్ బాస్ చెప్పాడు. ఎవరైతే బజర్ ని ఫస్ట్ ప్రెస్ చేసి, ఒక్కో స్లాట్ ని కొనుక్కుంటారో.. వాళ్లు ఆ పాస్ కోసం పోటీపడే ఛాన్సు పొందుతారని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఫైమా, రేవంత్, శ్రీహాన్.. బజర్ ప్రెస్ చేశారు. మరోవైపు తను ఈ గేమే ఆడనని ఆదిరెడ్డి భీష్మించుకు కూర్చొన్నాడు. ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గురించి శ్రీహాన్, శ్రీ సత్యతో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఒకవేళ ఆ పాస్ గెలుచుకుంటే శ్రీసత్య కోసం ఉపయోగిస్తానని శ్రీహాన్ చెప్పాడు. ఎందుకు అని అడగ్గా.. ఓ వారమైనా సరే కలిసుంటావ్ కదా అని ఆమెతో అన్నాడు. దీంతో శ్రీసత్య తెగ సిగ్గుపడిపోయింది. ముఖంపై చేయి పెట్టుకుని మరీ ముసిముసిగా నవ్వుకుంది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శ్రీహాన్ బయట ఆల్రెడీ సిరితో రిలేషన్ లో ఉన్నాడు. హౌసులో మాత్రం శ్రీ సత్యతో పులిహోర కలుపుతున్నాడు. అయితే బిగ్ బాస్ లో ఎలా ఉన్నా సరే బయటకొచ్చిన తర్వాత తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతుంటారు. అది చూసే ప్రేక్షకులకు కాస్త వింతగా ఉంటుంది. ఎందుకంటే హౌసులో సదరు కంటెస్టెంట్స్ చేసే పనులు అలాంటివి మరి! ప్రస్తుత సీజన్ నే తీసుకుంటే ఎక్కువ రోజులు ఉండటం వల్ల శ్రీసత్య- శ్రీహాన్ మధ్య బాండింగ్ ఏర్పడి ఉండొచ్చు. దీన్ని చూసి పలువురు నెటిజన్స్.. లవ్ ట్రాక్ మొదలైందా అని మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం ‘పాపం సిరి’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రీ సత్య- శ్రీహాన్ బాండింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.