వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి వివాదాలంటే సరదా. అందుకే ఎల్లప్పుడూ ఏదొక కాంట్రవర్సితో వార్తల్లో నిలుస్తుంటాడు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతూ వచ్చాడు. వర్మ ఐడియాలజీ సాధారణ మనిషిలా ఉండదు.. అందరూ ఓ రకంగా ఆలోచిస్తే వర్మ మరో రకంగా ఆలోచిస్తుంటాడు.
అలాంటి వర్మ పెద్దయ్యాక ఇలా మారాడా? లేక చిన్నతనం నుండే ఇలా భిన్నమైన ఆలోచనలతో ఉన్నాడా? అనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి వర్మ గురించి ఎవరికి తోచినట్లుగా వారు అభిప్రాయపడుతుంటారు. మరి వర్మ చిన్నతనంలో ఎలా ఉండేవాడు.. నిజంగానే అతనికి అమ్మాయిలంటే అంత పిచ్చి ఉందా? అనే విషయాలను వర్మ సోదరి విజయలక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వర్మ గురించి విజయలక్ష్మి మాట్లాడుతూ.. “చిన్నతనం నుండే అన్నయ్య(ఆర్జీవీ) లాజికల్ గా ఆలోచించేవాడు. ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదు. 9 వయసులో మా మామయ్యతో నేను, అన్నయ్య సినిమాకు వెళ్లాం. వచ్చాక మామయ్యను.. ఆ మూవీలో ట్రైన్‌ను బ్లాస్ట్ చేసేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్ పెట్టి కొద్దిసేపటికి రైలు రాగానే పేలిపోయేలా ప్లాన్ చేశారు. అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు ఆ డైరెక్టర్ టైమ్ బాంబు సెట్ చేయడం ఎందుకు? అని అడిగాడు. అది విని అందరం షాకయ్యాం.అందరూ అనుకున్నట్లు అన్నయ్యకి అమ్మాయిల పిచ్చి అసలు లేదు. 14 ఏళ్ళ వయసులో మా ఇంటికి నా ఫ్రెండ్ అనురాధ వచ్చింది. ఆమెతో నీ కళ్లు చాలా బావున్నాయని చెప్పేశాడు. నేను షాక్ అయ్యాను. దానికి నా ఫ్రెండ్ చాలా మురిసిపోయేది. ‘అదేంట్రా దానికి మెల్లకన్ను, నీకు ఎలా నచ్చింది?’ అని అడిగా.. దానికి అన్నయ్య ‘ఊరికే అన్నాలే.. అస్సలు అమ్మాయిని కూడా చూడలేదు. ఏదో ఓ మాట అనేశాను’ అని చెప్పాడు. అలాగే ఓసారి బ్యాంకులో ఓ అమ్మాయితో నీ నవ్వు బాగుందని అన్నాడు. ఆమె కూడా మేము కనిపించినప్పుడల్లా మురిసిపోయేది. అలా అన్నయ్య అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వారితో మిస్ బిహేవ్ చేయలేదు. ఈ మధ్య అమ్మాయిలతో డ్యాన్స్‌లు వీడియోలు కూడా అలాంటిదే” అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది.