SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Bheemla Nayak Movie Genuine Review In Telugu

భీమ్లా నాయక్ మూవీ రివ్యూ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 25 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భీమ్లా నాయక్ మూవీ రివ్యూ!

నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్, మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: సూర్యదేవర నాగావంశీ
కథ: సచి(late)
కథనం, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్
సంగీతం: తమన్
దర్శకత్వం: సాగర్ కే చంద్ర

టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ మూవీ ‘భీమ్లా నాయక్’. కొంతకాలంగా అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హంక్‌ రానా దగ్గుపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ చిత్రం.. థియేట్రికల్ రిలీజై ప్రేక్షకుల ముందుకొచ్చింది. భీమ్లా నాయక్ సినిమా హడావిడి రిలీజ్ కు ముందురోజు నుండే అట్టహాసంగా మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం.. భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి రిలీజ్ ముందు నుండే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన భీమ్లా నాయక్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

రిటైర్డ్ హవాల్దారు డానీయల్ శేఖర్(రానా) ఓరోజు అడవి మార్గం నుండి కారులో తన సొంతూరుకి వెళ్తుంటాడు. డ్రైవర్ కారు నడుపుతుండగా.. డానీయల్ వెనుక సీట్లో నిద్రపోతాడు. అది లిక్కర్ ఫ్రీ జోన్ కావడంతో చెక్ పోస్ట్ వద్ద డానీయల్ కారును పోలీసులు ఆపుతారు. పోలీసులు చెక్ చేస్తుండగా.. డానీయల్ కారులో లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయి. డానీయల్ ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై దాడికి దిగుతాడు. ఇంతలో సబ్ ఇన్స్పెక్టర్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) అక్కడికి వచ్చి డానీ మీద చేయి చేసుకొని.. జీప్ ఎక్కించి స్టేషన్ కి తీసుకెళ్తాడు.

స్టేషన్ లో కేసు ఫైల్ చేసే క్రమంలో డానీకి బడా రాజకీయ నాయకులతో, పోలీసు శాఖ వారితో పరిచయాలు ఉన్నాయనే విషయం భీమ్లాకి తెలుస్తుంది. అయినా సరే.. భీమ్లా తన డ్యూటీ ప్రకారం.. కేసు ఫైల్ చేసి సబ్ జైలుకి రిమాండ్ కి పంపిస్తాడు. ఈ క్రమంలో డానీకి మండిపోయి ఇగో క్లాష్ అవుతుంది. వెంటనే భీమ్లా సస్పెండ్ అయ్యేలా చేస్తాడు. డానీ చేసిన పనికి భీమ్లా ఇగో క్లాష్ అవుతుంది. ఇక అక్కడి నుండి భీమ్లా- డానీల మధ్య పోరు మొదలవుతుంది. ఈ పోరులో అటు భీమ్లా భార్య సుగుణ (నిత్యమేనన్).. ఇటు డానీ ఫ్యామిలీ(సముద్రఖని, సంయుక్త మీనన్) ఎలా స్ట్రగుల్ అయ్యారు? భీమ్లా – డానీల పోరులో ఎవరు గెలుస్తారు? అనేది మిగిలిన కథ.

కథనం – విశ్లేషణ:

భీమ్లా నాయక్ ట్రైలర్ లో చెప్పినట్లుగానే అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన యుద్ధమే ఇది. మలయాళంలో బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందించిన ఈ స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీ కోసం చాలా మార్పులే చేశారు. కానీ ఎక్కడా మలయాళం ఫ్లేవర్ పోకుండా జాగ్రత్తపడ్డారు. కథతో పాటు సాగే సన్నివేశాలు కాబట్టి మలయాళంలో కనిపించిన సీన్స్ భీమ్లా నాయక్ లో కనిపిస్తాయి. ఒరిజినల్ స్క్రిప్ట్ డిస్టర్బ్ అవ్వకుండా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకున్నారు. ఇక సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కి లోటే లేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ ఫీల్ రానివ్వదు.

Beemla Nayak Review

ముఖ్యంగా మలయాళం చూడకుండా కొత్తగా భీమ్లా నాయక్ చూసేవారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. తెలుగులో ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు చాలా వచ్చాయి కానీ.. ఇద్దరు హీరోలకు సమానంగా పవర్ ఫుల్ రోల్స్ ఇచ్చి.. ఇగో క్లాషెస్ కథతో అయితే సినిమాలు రాలేదు. ఖచ్చితంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పర్ఫెక్ట్ పిక్చర్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా భీమ్లా నాయక్ ని.. మాస్ – క్లాస్ అంశాలతో ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ మూవీ మలయాళంలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా రూపొందించడంలో మేకర్స్ సక్సెస్ అందుకున్నారు.

Beemla Nayak Review

ఒరిజినల్ చూసినప్పటికి భీమ్లా నాయక్ లో థ్రిల్ కలిగించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా పవన్ – రానాలు ఎదురుపడిన ప్రతి సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక సినిమాలో ఎక్కడ కూడా పవర్ స్టార్ అనే స్థాయిని, భల్లాలదేవ రానా అనే స్థాయిలను సినిమాలోకి తీసుకురాలేదు. ఈ విషయంలో రచయిత – దర్శకుడిని అభినందించాలి. పవన్ – రానాల తర్వాత సినిమాలో చెప్పుకోదగిన పాత్ర భీమ్లా భార్య సుగుణ. నిత్యమేనన్ ఈ పాత్రకు చాలా న్యాయం చేసింది. నిత్యకి చాలారోజుల తర్వాత ఓ మంచి రోల్ పడిందని చెప్పవచ్చు. డానీయల్ తండ్రి పొలిటికల్ లీడర్ జీవన్ బాబుగా సముద్రఖని.. కనిపించింది తక్కువ సీన్సలో అయినప్పటికీ మాస్ సీన్స్ లో మెప్పించారు.

Beemla Nayak Review

డానీ భార్యగా సంయుక్త మీనన్ కథలో కీలకమైన పాత్ర పోషించింది. తన పరిధి మేరకు న్యాయం చేసింది. తెలుగులో ఫస్ట్ మూవీ కాబట్టి అవసరమైనంతే ఆమె పాత్రను చూపించారు. భీమ్లా పై ఆఫీసర్ సీఐ గా మురళీ శర్మ.. ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. ఇక చెప్పుకోవాల్సింది మద్యం దుకాణం నడిపే నాగరాజు పాత్రలో కనిపించే రావురమేష్ గురించి. ఒకే టైంలో అటు హాస్యం, ఇటు వెటకారం పలికించి కామెడీతో మెప్పించారు రావురమేష్. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఎవరినీ ఊహించుకోలేం. ఎమ్మెల్యేగా తనికెళ్ళ భరణి తెలంగాణ యాసలో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఏ పాత్ర కూడా ఊరికే పెట్టారు అనుకునేలా లేవు. అందరూ వారి వారి పాత్రలకి వంద శాతం న్యాయం చేశారు. మరోసారి ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ పండగ చేసుకునే సినిమాను అందించడానికి స్క్రిప్ట్ సెలక్షన్ బట్టే అర్థమవుతుంది.

టెక్నీషియన్స్ పనితీరు:

భీమ్లా నాయక్ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే – డైలాగ్స్.. త్రివిక్రమ్ పెన్ వర్క్ బలమైందని మరోసారి ప్రూవ్ అయింది. ఆయన దర్శకత్వం చేయనప్పటికి డైలాగ్స్ లో తన మార్క్ చూపించారు. సినిమా దర్శకుడు సాగర్ కే చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు నేరుగా పవన్ కళ్యాణ్ – రానాలతో సినిమా అంటే మాములు విషయం కాదు. దర్శకుడిగా సినిమాకి ఏమేమి కావాలో అన్ని నటుల నుండి రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ లెజెండరి రవి కే చంద్రన్ గారు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్స్, యాక్షన్ ఘట్టాలలో కెమెరాతో ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్.. భీమ్లా నాయక్ పై ఫస్ట్ హైప్ తీసుకొచ్చిన పర్సన్. పాటలతో పాటు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి న్యాయం చేశాడు. ఎక్కువ తక్కువ కాకుండా సినిమాకి కావాల్సినంతే ఇచ్చి సంతృప్తి పరిచాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఓ రీమేక్ సినిమాని స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో నిర్మించి సాహసం చేశాడు. అతని కాంఫిడెన్స్ నిర్మాణ విలువలలో కనిపిస్తుంది. ఖచ్చితంగా పైసా వసూల్ చేసుకుంటాడని చెప్పవచ్చు.

ప్లస్ లు:

  • కథ – కథనం – సంభాషణలు
  • పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ లు:

  • అంత ఇష్టం సాంగ్ లేకపోవడం

చివరి మాట: పక్కా.. భీమ్లా నాయక్ విశ్వరూపం!

Tags :

  • Bheemla Nayak
  • latest tollywood news
  • movie review
  • Pawan Kalyan
  • rana daggubati
  • Telugu Movie Reviews
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న దగ్గుబాటి హీరో.. అమ్మాయి ఎవరంటే?

    త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న దగ్గుబాటి హీరో.. అమ్మాయి ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam