పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కి సినిమాల్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అకిరాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా తల్లి రేణుదేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా అకిరా బర్త్ డే వచ్చిందంటే.. మెగా ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే.. తాజాగా అకిరా బర్త్ డే సందర్భంగా తల్లి రేణుదేశాయ్ ఓ వీడియో షేర్ చేసింది.
ఆ వీడియోలో అకిరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బాక్సింగ్ చేస్తున్న అకిరాను చూసి మెగాఫ్యాన్స్ అందరూ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ క్రేజ్ ని, లెగసీని మరోస్థాయికి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ తర్వాత.. ఆయన నటవారసుడిగా అకీరా వస్తాడని.. మెగాఫ్యామిలీ లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తాడని పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగాఫ్యాన్స్ భావించారు. కానీ మెగాఫ్యాన్స్ కి రేణుదేశాయ్ షాకింగ్ న్యూస్ చెప్పింది.
తాజాగా ఆ వీడియో షేర్ చేసిన రేణుదేశాయ్.. అకిరా సినీ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది. ‘అకీరాకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని, అలాగే ఏ సినిమాను ఓకే చేయట్లేదని చెప్పింది. అదేవిధంగా అకీరా డెబ్యూ పై వస్తున్న రూమర్లను ఏమాత్రం నమ్మొద్దని తేల్చేసింది రేణుదేశాయ్. ఈ వార్త విన్న వెంటనే మెగాఫ్యాన్స్ అంతా షాక్ కు గురయ్యారు. అకీరా సినిమాల్లోకి రాడని కన్ఫర్మ్ అయ్యేసరికి పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం రేణుదేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి రేణుదేశాయ్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.