మాస్ హీరో నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది. ఓవైపు బాలయ్య అఖండతో, గోపీచంద్ క్రాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకునే సరికి.. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక రాయలసీమ మాస్ స్టోరీతో ప్లాన్ చేసిన ఈ సినిమాలో.. బాలయ్య సరికొత్త మాస్ లుక్కులో కనిపించనున్నట్లు తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. లుక్కు అదిరింది.. కానీ అప్పుడే సినిమా పై, బాలకృష్ణ కొత్త లుక్కుపై ట్రోల్స్ మొదలైపోయాయి. ఫస్ట్ లుక్ రిలీజ్ కాకముందే బాలయ్య లుక్ లీక్ అవ్వడంతో.. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన మూవీకి రీమేక్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్యకు 107వది కావడం విశేషం. తాజాగా బాలయ్య లుక్ చూస్తే.. నల్లటి చొక్కా, లుంగీ, కళ్ళజోడు.. పక్కనే కారుతో చాలా మాసివ్ గా కనిపిస్తున్నాడు. కానీ ఇదే స్టైల్ లో మేం.. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా చేసిన ‘మఫ్టీ‘ సినిమా చూశామని అంటున్నారు నెటిజన్లు. ఇక ఆ లుక్కు, ఈ లుక్కు మ్యాచ్ అవ్వడంతో సోషల్ మీడియాలో గోపీచంద్ మఫ్టీ రీమేక్ చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
NATASIMHAM #NandamuriBalakrishna in his “MASS”iest Avatar ever!! 🔥🔥
Here’s the Menacing First Look of #NBK107 😎💥💥#NBK107HuntBegins 🦁@shrutihaasan @officialviji @varusarath5 @megopichand @MusicThaman @MythriOfficial pic.twitter.com/4Svo8HbAb7
— Suman TV™ (@SumanTvOfficial) February 21, 2022
ఇక కుర్చీ పై కూర్చొని బాలయ్య సెటిల్మెంట్ చేస్తూ మాస్ లుక్కులో కనిపించినా.. ఫ్యాన్స్ కూడా అచ్చం మఫ్టీ లుక్ లాగే ఉందనడం గమనార్హం. మరి బాలయ్య కోసం పవర్ ఫుల్ కథను రెడీ చేసానని చెప్పాడు దర్శకుడు. ఇప్పుడేమో మఫ్టీ గోల మొదలైంది. మరి కొత్త కథ రాశారా? లేక మఫ్టీ కథనే తెలుగుకు తగ్గట్టుగా మార్చారా? అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బాలయ్య మాస్ లుక్కు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.