హీరోయిన్ అవ్వడానికి అన్ని అర్హతలున్నా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ నేటి హీరోయిన్స్ కంటే ఎక్కువ పేరు సంపాదించిన నటీమణి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ ఈమె వెంటపడుతున్నాడు.
హీరోయిన్ అవ్వడానికి అన్ని అర్హతలున్నా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ నేటి హీరోయిన్స్ కంటే ఎక్కువ పేరు సంపాదించిన నటీమణి వరలక్ష్మి శరత్ కుమార్. శరత్ కుమార్ నట వారసురాలిగా సినిమా రంగంలోకి ప్రవేశించి ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు తన నటనతో ఎంతోమందిని తన అభిమానులుగా చేసుకుంది. తాజాగా ఒక దర్శకుడు వరలక్ష్మి విషయం లో తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
గోపిచంద్ మలినేని.. వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ లోనే ఇప్పుడు క్రేజీ అండ్ బిజీ డైరెక్టర్ గా మారిపోయాడు. గోపీచంద్ మలినేని, వరలక్ష్మి కాంబినేషన్ లో క్రాక్, వీరసింహారెడ్డి అనే రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి వరుస ప్లాప్ లతో ఉన్న గోపిచంద్ కి మంచి బూస్టప్ ని ఇచ్చాయి. అలాగే ఆ రెండు సినిమాలు కూడా వరలక్ష్మి పోషించిన క్యారెక్టర్స్ వల్లే విజయవంతమయ్యాయని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. క్రాక్ మూవీ లోని జయమ్మ క్యారక్టర్ లో గాని వీరసింహ రెడ్డి లోని భానుమతి క్యారక్టర్ ద్వారా గాని వరలక్ష్మి చూపించిన పెర్ఫార్మన్స్ ఒక రేంజ్ లో ఉంది. పైగా వరలక్ష్మి తన క్యారక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకొని ఆయా క్యారక్టర్ లకి నిండు ధనాన్ని తెస్తుంది. తన క్యారక్టర్ ద్వారా వరలక్ష్మి ఆయా ప్రాంతాల యాసని కూడా పలికి ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. గోపి చంద్ మలినేని, మాస్ మహారాజ రవితేజ హీరోగా ఒక కొత్త మూవీకి డైరెక్షన్ చెయ్యబోతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ మూవీలో ఇంతవరకు హీరోయిన్ కన్ ఫార్మ్ కాలేదు. కానీ గోపీచంద్ మాత్రం తనకి అచ్చొచ్చిన వరలక్ష్మి ని మాత్రం మూవీ కోసం బుక్ చేసాడు. ఆల్రెడీ వరలక్ష్మి డేట్స్ కూడా తీసుకున్నాడని సమాచారం. తన గత చిత్రాల్లో లాగానే వరలక్ష్మి కోసం ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ని గోపీచంద్ తన కొత్త మూవీ లో రాసుకున్నాడని అంటున్నారు. ఆ క్యారక్టర్ ద్వారా తన అదృష్ట దేవత వరలక్ష్మి తనకి హ్యాట్రిక్ హిట్ ని అందిస్తుందనే నమ్మకంతో గోపీచంద్ మలినేని ఉన్నాడు.