రౌడీ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఓ బోల్డ్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా అందే చర్చ జరుగుతోంది.
అయితే విజయ్ దేవరకొండను అలాంటి ఫోజుతో పోస్టర్ రిజీల్ చేయడం వెనుక ప్రధాన కారణం ప్రమోషన్స్ అని అందరికీ తెలిసిందే. అయితే అది సినిమాకి కూడా రిలేట్ కావడంతో విజయ్ ధైర్యం చేసి అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి యూఎఫ్ఎసీ ఫైటర్లు మ్యాచ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా టవల్స్ మధ్య నిల్చుని ఒంటిపై నూలు పోగు లేకుండా బరువు కొలుస్తుంటారు. కొందరు అండర్ వేర్ అయినా వేసుకోవచ్చుగా అనుకుంటారు. కానీ, అక్కడ ప్రతి గ్రాము కౌంట్ కాబట్టే ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా బరువు కొలుస్తారు.
A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022
కానీ, రెజ్లర్లని ఎందుకు అలా బేర్ బాడీతో బరువు కొలుస్తుంటారు అని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ రెజ్లర్ WKN ఇంటర్నేషనల్ ఛాంపియన్, SJJIF వరల్డ్ ఛాంపియన్, WBC ముయే థాయ్ ఇండియా ప్రెసిడెంట్ వైభవ్ శెట్టి స్పందించాడు. ‘ఒక ఎంఎంఏ ఫైటర్ గా నేను నీకు చెప్పగలను అక్కడ ప్రతి గ్రాము కౌంట్ అవుతుంది. నిజానికి నేను ఎక్కువ తగ్గడానికి ఇష్టపడను.. ఒక 3 నుంచి 4 కేజీలు మాత్రమే తగ్గుతాను. కానీ నా మిత్రులు కొందరు 9 నుంచి 10 కేజీల వరకు తగ్గుతుంటారు. అలా బరువు కొలిచే వరకు తగ్గుతూనే ఉంటారు. కొందరైతే నీళ్లు కూడా తాగకుండా బరువు తగ్గుతుంటారు. పురుషులు ధరించే అండర్ వేర్ బరువు 50 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అందుకే ఒంటిపై ఏమీ ఉంచుకోరు’ అంటూ వైభవ్ శెట్టీ స్పందించారు.
Rose Rose aise gifts nahi milte …@miketyson @TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @RonitBoseRoy @meramyakrishnan @iamVishuReddy @DharmaMovies @PuriConnects @sonymusicindia @sonymusicsouth pic.twitter.com/Xklij1umTx
— Karan Johar (@karanjohar) July 2, 2022
మరోవైపు లైగర్ పోస్టర్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. విజయ్ దేవరకొండ డెడికేషన్, గట్స్ చూసి సర్వత్రా ప్రశంసలు వెల్లివెత్తుతున్నాయి. సినిమా కోసం విజయ్ ఏదైనా చేసేస్తాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. విజయ్ బేర్ బాడీ పోస్టర్ కు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల నుంచి ఎక్కువగా స్పందన లభిస్తోంది. అంతా విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజయ్ లైగర్ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Breathe guys breathe the temperature is rising all over India today🥵🔥@miketyson @TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @RonitBoseRoy @meramyakrishnan @iamVishuReddy @DharmaMovies @PuriConnects @sonymusicindia @sonymusicsouth pic.twitter.com/vSZX8Q82WI
— Ananya Panday (@ananyapandayy) July 2, 2022