ఎనర్టీటిక్ స్టార్ రామ్ పోతినేని, కన్నడ బ్యూటీ కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం "ది వారియర్". ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. రామ్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా ఈ చిత్రం జులై 14 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనంతపురంలో అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజిలో ది వారియర్ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకను చిత్ర బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ.. "లింగు స్వామి చాలా మంచి మనసున్న వ్యక్తి. ఇలాంటి మనిషి నేనిప్పటి వరకూ కలవలేదు. కమర్షియల్ గా హిట్ అందుకున్న పలు తెలుగు సినిమాల్లోని సన్నివేశాలను లింగుస్వామి చిత్రాల స్ఫూర్తితోనే తీశారు. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు అంటే ఏంటో అనంతపురంలో చూశా.. అని లింగుస్వామి నాతో అన్నారు. ఆది, కృతిశెట్టితో నటిచడం కొత్త అనుభూతిని ఇచ్చింది" అని రామ్ అన్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హజరైన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రాయలసీమ ప్రజలపై తనకున్న అభిమానాన్ని తెలియజేశాడు.అనంతపురంలో ది వారియర్ ట్రైలర్ ఈ వెంట్ అని ఆ మూవీ టీమ్ చెప్పగానే చాలా సంతోషించాని, ఎందుకంటే సీమ అంటే తన సొంత ఇల్లు అనేది తన పీలింగ్ అని బోయపాటి శ్రీను తెలిపారు. రాయసీమ వారేవరు బోయపాటిని శ్రీనును దర్శకత్వం చేశాడని అనుకోరు. తమ కుటుంబ సభ్యుడు డైరెక్షన్ చేశాడని చెప్పుకుంటారని, తనను రాయలసీమ వాళ్లు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని బోయపాటి శ్రీను అన్నారు. "బాగున్నారా.. అనంతపురం" అని అందాల భామ కృతిశెట్టి తెలుగు మాటలు పలికేసరికి అభిమానులు పెద్ద ఎత్తున విజిల్స్, కేకలు వేశారు. భారీఎత్తున వచ్చిన అభిమానులతో వేడుక ప్రాంగణం నిండిపోయింది. "ది వారియర్" వేడుకను చూస్తే.. పెద్ద జాతర జరిగిందేమో అనేంతల సందడి వాతావరణం కనిపించింది. శుక్రవారం విడుదలైన ట్రైలర్ అందరని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కు అంతే ధీటుగా విలన్ ఆది పినిశెట్టి చక్కగా సరిపోయాడు. కర్నూల్ ను శాసించే గురు పాత్రలో ఆది నటన మైండ్ బ్లోయింగ్. ముఖ్యంగా రామ్, ఆది ల మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయమని చెప్పొచ్చు. మరి.. ది వారియర్ మూవీ ట్రైలర్ పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.