మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా? గత కొన్ని రోజుల నుంచి ఇదే వార్త కాస్త జోరుగా షికారు చేస్తోంది. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహనరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళిలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ మూవీని తెలుగులోకి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ ఇటీవల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.
ఇందులో చిరుని పరిచయం చేస్తూ.. Chiranjeevi కి బదులుగా Chiranjeeevi అని ఎక్స్ ట్రా E పడింది. దీంతో చిరు న్యుమరాలజీని ఆశ్రయించి పేరును మార్చుకున్నాడా అని సినీ విశ్లేషకులు, అభిమానులే కాకుండా మీడియా కూడా కోడై కూస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం చిరంజీవి పేరులో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది. మూవీ యూనిట్ తప్పిదం కారణంగానే అదనంగా E పడిందని తెలుస్తోంది. టీమ్ చేసిన ఈ తప్పిదం కారణంగా ఇంతటి ప్రమాదం జరిగిందట.
ఇది కూడా చదవండి: Komaram Bheem: ‘RRR’ కొమరం భీం ఇంట్రడక్షన్ సీన్ మేకింగ్.. వీడియో వైరల్!
దీంతో వెంటనే పేరును ఎడిట్ చేసి భవిష్యత్ లో ఇలాంటి మిస్టెక్స్ లేకుండా చూస్తామని యూనిట్ సభ్యులు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల విడుదల చేసిన ఈ మోస్టర్ పోస్టర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మాస్ లుక్ లో కనిపిస్తున్న చిరును చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, నయనతార వంటి పలువురు నటీనటులు నటిస్తున్నారు. మోషన్ పోస్టర్ రీలీజ్ లో జరిగిన ఈ తప్పిందపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.