మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా రవితేజకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో రవితేజ లుక్ అదిరిపోయింది. రవితేజ చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. ఒక బ్లాక్ వెహికల్ లో రవితేజ మేకని తీసుకుని వస్తుంటారు. ‘ఫస్ట్ టైం ఒక మేక పిల్లని ఎత్తుకుని పులి వస్తా ఉన్నది’ అంటూ ఒక డైలాగ్ వస్తుంది. టీజర్ లో మాస్ మహారాజ రవితేజకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. విలన్స్ తో రవితేజ ఫైట్ చేసి దుమ్ము దులిపేశారు. చూస్తుంటే.. చిరంజీవితో పాటు సమానంగా రవితేజ పాత్రని కూడా మలచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ.. ఏసీపీ విక్రమ్ సాగర్ గా నటిస్తున్నారు.
అయితే చిరంజీవికి తమ్ముడి పాత్రలో నటిస్తున్నారని అంటున్నారు. చిరంజీవి చూస్తే వాల్తేరు వీరయ్యగా నటిస్తున్నారు. ఇటు రవితేజ పోలీస్ గా నటిస్తున్నారు. చూస్తుంటే వీరయ్యకి, ఏసీపీ విక్రమ్ సాగర్ కి మధ్య ఛేజింగ్ సీన్స్ ఉంటాయేమోనని అనిపిస్తుంది. ఇక వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్, కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. 2000వ సంవత్సరంలో వచ్చిన అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ.. 22 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. మరి ఈ మల్టీస్టారర్ సినిమా జనాన్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. సంక్రాంతికి మెగా మాస్ జాతరే అని మెగా మాస్ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.